Vishwaksen interview: గామి సినిమా కథను దర్శకుడు విద్యాధర చెప్పినప్పుడే ఈ సినిమా తీయడానికి ఐదుసంవత్సరాలు పడుతుందని నేను ఊహించాను. కానీ ఇలాంటి ఓ డిఫరెంట్ను ఫిల్మ్‌ను కంప్లీట్ చేయగలడే నమ్మకం విధ్యాద రపై నాకు కలిగింది. స్క్రిప్ట్ మొత్తం చదివాను నేను. చాలా బాగుంది చెప్పాలంటే…కాస్త భయం వేసింది స్క్రిప్ట్ చదివేప్పుడు (Vishwaksen interview)
‘గామి’ సినిమాలో శంకర్ అనే ఓ అఘెరా పాత్రలో కనిపిస్తాను. మానవస్పర్శను ఆస్వాదించలేని అరుదైన వ్యాధి ఉంటుంది తనకు. ఈ తరహా సమస్యలు కొందరికీ ఉంటాయని విన్నాను. కొందరికి హ్యూమన్ ఫోబి యా ఉంటుంది. వారికి తోటీవారి స్పర్శ అంటే అసలు ఇష్టం ఉండదు. ఈ సినిమా స్టారై్టన వారంలోపే మేం వారణాసిలో చిత్రీకరణ చేశాం. అక్కడ వివిధ రకాలైన అఘోరాలను చూశాం. కొందరు అఘోరాలు శవాన్ని భుజిస్తారు అంటారు. కానీ అక్కడ మాంసాహారం ముట్టని అఘోరాలు కూడా ఉంటారు. ‘గామి’ సినిమా సమయంలో నేను నిజమైన అఘోరాను అని భ్రమపడి కొందరు నాకు దానం చేశారు.
RGV Vyooham Review: రామ్‌గోపాల్‌వర్మ వ్యూహం రివ్యూ
Vennela kishore Chari 111 Movie Review: చారి 111 రివ్యూ
Gaami: గామి…ముట్టుకోకూడదు
ప్రాణాలకు తెగించి తీశాం
ప్రాణాలకు తెగించి మేం ‘గామి’ చిత్రీకరణను పూర్తి చేశాం. హిమలయాల్లో చాలా కష్టమైన షెడ్యూల్ పూర్తి చేశాం. మైనస్ 30 డిగ్రీల చలిలో ఉన్న లొకేషన్స్‌లో చిత్రీకరణ చేశాం. పైన మంచు గడ్డ కట్టి, కింద నది పారుతున్న లొకేషన్స్‌లో చిత్రీకరణ చేశాం. నిజంగా ఓ సినిమా కోసం ప్రాణాలు తెగించి చిత్రీకరణ చేయాలా? అని ఇప్పుడు అనిపిస్తోంది. అప్పుడెదో చేశాం…కానీ ఇప్పుడైతే ‘గామి’ కోసం నేను చేసిన సాహాసాలను మళ్లీ చేయలేను. ఎందుకంటే సినిమాలు చేయాలంటే మనం బతికి ఉండాలి కదాముందు విద్యాధర ‘గామి’ కోసం చాలా పరిశోధన చేశాడు. మాకు అతి తక్కువ రిసోర్సెస్, బడ్జెట్లో క్వాలిటీగా సినిమాను ఏ విధంగా తీయాలో అలా ఓ ప్లాన్ వేసుకున్నాడు. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఈ సిని మా కోసం విద్యాధర వర్క్ చేస్తున్నాడు. హిమాలయాల్లో మేం చిత్రీకరణ చేసే సమయంలో మా టీమ్‌లో ఉన్న ఒకే అమ్మాయి చాందినీ చౌదరి. ఆమె చాలా కష్టాలు పడింది. నా వంతుగా నేను ఈ సినిమా కోసం పారితోషికం తీసుకోలేదు ఇప్పటివరకూ. ‘గామి’ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు అర్థం కానీ విధంగా ఉండదు. కానీ స్టాండర్ట్స్ మాత్రం ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటాయి. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నొలన్ స్క్రీన్ ప్లే చూస్తున్న అను భూతి కలుగుతుంది. సౌండ్, వీఎఫ్ఎక్స్ షాట్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. ఒక్క ట్రైలర్లోనే 58 సీజీ షాట్స్ ఉన్నాయి
Bhoothaddam Bhaskar Narayana Review: భూతద్దం భాస్కర్ నారాయణ రివ్యూ
లైలాలో అమ్మాయిపాత్రచేస్తున్నాను
నా కెరీర్లో డిఫరెంట్ సినిమాలు చేయాలనుకుంటున్నారు. ‘ఫలక్‌నూమా దాస్’ వంటి మాస్ ఫిల్మ్‌లో హీరోగా చేసింది నేను. ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ సినిమాలో 36 సంవత్సరాలు వయసు వ్యక్తిలో చేసింది నేను. ఇప్పుడు ‘గామి’ సినిమా చేసిందీ నేనే. ఇలా డిఫరెంట్ సినిమాలు చేయాలని ఉంది నాకు నెక్ట్స్ హైదరాబాద్ అబ్బాయి మలక్‌పేట నేపథ్యంలో మెకానిక్ రాఖీ చేస్తున్నాను. ‘లైలా’ అనే ఓ లవ్‌స్టోరీ ఉంది. ఇందులో సెకం డాఫ్‌లో నేను పూర్తిగా అమ్మాయి పాత్రలో నటిస్తాను. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం నా నెక్ట్స్ రిలీజ్. నిర్మాత సుధాకర్ చెరుకూరితో ఓ సినిమా ఉంటుంది. ‘ఫలక్నూమదాస్ 2’ రెండు మూడు సీన్స్ రాశాను. ‘హ్యాష్టాక్ కల్ట్’ సినిమా ఉంది. కథలు రాస్తున్నాను. ‘ఫలుక్నూమా దాస్ 2’ ఎప్పుడో చెప్ప లేను. నా కెరీర్‌కు ఆ సినిమా ఓ ట్రంప్ కార్డ్ అనుకుంటున్నాను.