Gaami:అఘోరా పాత్రలో విశ్వక్సేన్ నటిస్తున్నారని, ఇది ‘గామి’ (Gaami) సినిమా అని ఎప్పట్నుంచో ప్రచారం సాగుతోంది. ఎట్టకేలకు ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ సినిమాలో శంకర్ అనే అఘోర పాత్రలో కనిపిస్తారు విశ్వ క్. అయితే శంకర్ పాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే..మానవస్పర్శ అతడిని తాకకూడదు. కానీ అతను మాత్రం మానవస్పర్శ కోసం తహాతహాలాడుతుంటాడు. ఈ పాయింట్ కొత్తగా అనిపిస్తుంది ఆడి యన్స్‌కు. అలాగే ఈ సినిమా కేవలం అఘెరా నేపథ్యంలోనే ఉండదు. మరో డిఫరెంట్ సెటప్ కూడా ఈ సినిమాలో ఉంది. దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమా పనులు జరుగుతూనే ఉన్నాయి. వీఎఫ్ ఎక్స్ వర్క్స్ భారీగా చేయాల్సి ఉంది ఈ సినిమాకు. ఈ సినిమా ఆలస్యమవడానికి ఇదొక ముఖ్యకారణం. ఈ అడ్వెంచరస్ డ్రామాకు విధ్యాధర కాగిత దర్శకుడు. వి సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కాకుండా విశ్వక్సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా చేస్తున్నాడు. మార్చి 8న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
TAGGED:
Gaami, Vishwaksen
TeamTH