Bhoothaddam Bhaskar Narayana Review: గమనం, మనుచరిత్ర వంటి సినిమాలతో నటుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు శివకందుకూరి. ఈ యాక్టర్ తాజాగా చేసిన ప్రయత్నం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. మరి..ఈ సినిమా శివ కందుకూరికి హిట్ ఇచ్చిందా? రివ్యూలో చదివేద్దాం.
సినిమా: భూతద్దం భాస్కర్ నారాయణ
ప్రధాన తారాగణం: శివకందుకూరి, రాశీసింగ్, దేవి ప్రసాద్, అర్జున్, వర్షిణి
దర్శకుడు: పురుషోత్తమ్ రాజ్
నిర్మాతలు: స్నేహాల్, శశిధర్, కార్తీక్
మ్యూజిక్: బుల్గానిన్, శ్రీచరణ్ పాకాల
రన్‌టైమ్: 141 మినిట్స్
జానర్: మిస్టరీ థ్రిల్లర్
విడుదల తేదీ: మార్చి 1, 2024.
కథ
భూతద్దం భాస్కర్ నారాయణ ఓ చిన్నపాటి డిటెక్టివ్. కేసులను సాల్వ్ చేస్తుండటంలో పోలీసులకు సహా యం చేస్తుంటాడు. కానీ ఆంధ్రాప్రదేశ్ కర్ణాకట సరిహద్దుల్లో పద్దెనిమి సంవత్సరాలుగా ఓ సీరియల్ కిల్లర్ కేసును ఇటు భాస్కర్ కానీ, అటు పోలీసులు కానీ పరిష్కరించలేకపోతుంటారు. ఇదే కేసును జర్నలిస్ట్ లక్ష్మి మూడు సంవత్సరాలుగా ఫాలో అవుతుంటుంది. ఈ సీరియల్ కిల్లర్ అమ్మాయిలను మాత్రమే ఎందుకు చంపుతాడు? చనిపోయిన అమ్మాయిల శవాల దగ్గర దిష్టిబొమ్మలను ఎందుకు పెడతాడు? ఆ సీరియల్ కిల్లర్ వల్ల భాస్కర్ కుటుంబం పరోక్షంగా ఏ విధంగా నష్టపోయింది? ఈ సీరియల్ కిల్లర్ చేస్తున్న హత్యలకు వెనక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? పురణాల్లో చెప్పుకునే క్షీరసాగరమధనం ఏపిసోడ్‌కు, సీరియల్ కిల్లర్ వంశానికి ఉన్న సంబంధం ఏమిటి? అనేది సినిమాలో చూడాలి
Vennela kishore Chari 111 Movie Review: చారి 111 రివ్యూ
విశ్లేషణ
హంతుకుడిగా ముద్రపడి ఆత్మహాత్య చేసుకున్న అన్నయ్యను నిర్ధోషిగా నిరూపించాలనుకునే ఓ తమ్ముడు డిటెక్టివ్‌గా మారి, సీరియల్ కిల్లర్ కేసును సాల్వ్ చేయడమే సినిమా కథనం క్లుప్తుంగా. ఈ కథకే మైథలాజీ
అంశాలను మేళవించాడు దర్శకుడు. భాస్కర్ ఎందుకు డిటెక్టివ్ మారాలనుకున్నాడు? డిటెక్టివ్‌గా భాస్కర్
బలాలు, బలహీనతలు ఏమిటి? లక్ష్మీ సిస్టర్ శ్రావణి ఎందుకు హత్య చేయబడుతుంది? అనే సీన్స్‌తో తొలి
భాగం ముగుస్తుంది. మొయిన్ కథలకు తొలిభాగంలో చిన్న చిన్న లీడ్స్ మాత్రమే ఉంటాయి. కానీ అసలు
కథ సెకండాఫ్‌లో మొదలవుతుంది. శ్రావణి హత్యకు , సీరియల్ కిల్లర్‌కు సంబంధం లేదని తెలుసుకున్న
తర్వాత భాస్కర్ కేసు లీడ్ పాయింట్‌ను జస్ట్ ఓ ఊహతో కనుక్కోవడం రుచించదు. కానీ సీరియల్ కిల్లర్‌ను
పట్టుకునే క్రమంలో భాస్కర్ చేసే పోరాటాలు, ఇన్వెస్టిగేషన్ తీరు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. సీరియల్
కిల్లర్ మెటివ్ను దర్శకుడు యానిమేషన్‌తో చెప్పే కథనం ఆసక్తిగా ఉంటుంది. కానీ కన్విన్సింగ్‌గా అనిపిం చదు. శవాలను బోర్డర్ దాటించడం, అమ్మాయిలను ఎలా కిడ్నాప్ చేస్తున్నారు అన్న అంశాలు సినిమాలో ఉండవు. నిజానికి ఇది అంత సులభం కాదు. కానీ ఈ విషయాన్ని దర్శకుడు సులభంగా కొట్టిపారేశాడు. డైరెక్ట్‌గా చెట్టుకింద తల లేని అమ్మాయిల శవాలు మాత్రమే కనిపిస్తుంటాయి. కథలో పోస్ట్‌మార్టం రిపోర్ట్ కీలకమైనప్పుడు ఆ దశగా లోతుగా భాస్కర్ పరిశోధన ఎందుకుసాగదో అర్థం కాదు. ఇలా కొన్ని మైనస్‌లు ఉన్నాయి. కానీ కథ మాత్రం ముందుకు నడిచిన తీరు ఆడియన్స్‌ను ఈ విషయాలను ఏవీ గుర్తు చేయవు. ఓవరాల్ కథ బాగుటుంది. క్లైమాక్స్ రోటీన్‌గా లేకపోతే ఇంకా బాగుండేది.
RGV Vyooham Review: రామ్‌గోపాల్‌వర్మ వ్యూహం రివ్యూ
పెర్ఫార్మెన్స్
డిటెక్టివ్ భాస్కర్‌గా శివకందుకూరి బాగా నటించాడు. నటనలో మంచి పరిణీతి కనిపించింది. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో సెటిల్డ్‌గా చేశాడు. జర్నలిస్ట్ లక్ష్మీగా రాశీసింగ్ పాత్ర ఓకే. ఓ క్యారెక్టర్లా ఉంటుంది సినిమాలో హీరోయిన్ అన్న ఇంపాక్ట్ ఉండదు. సీఐ శంకర్‌గా దేవి శ్రీ ప్రసాద్ యాక్టింగ్ ఒకే. క్లైమాక్స్‌లో దేవి శ్రీ ప్రసాద్ మెప్పించే ప్రయత్నం చేశాడు. వర్షిని, షఫీ, వెంకట్కాకుమాను వారి వారి పాత్రల మేరకు చేశారు. దర్శకుడు పురుషోత్తమ్ మంచి ఇన్వెస్టిగేటివ్ స్టోరీ చెప్పారు. కథ, కథనంలో పదను, లోతైన ఇతీహాస పరిశోధన కనిపించింది. కానీ వివరణ స్పీడ్‌గా వెళ్లడం ఆడియన్స్ అర్థం కాదు. ఇక్కడే కాస్త డిస్కనెక్టివ్నెస్ ఉంటుంది. శ్రీచరణ్ పాకాల ఆర్ఆర్ ఒకే. బుల్గానిన్ మ్యూజిక్ సోసోగా ఉంటుంది. ఎడిటర్ గ్యారీకి ఇంకాస్త పని బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో. నిర్మాణవిలువలు ఒకే.
బలాలు
శివకందుకూరి యాక్టింగ్
కాన్సెప్ట్
కథ, కథనం
బలహీనతలు
సెకండాఫ్‌లో సాగదీత సన్నివేశాలు
క్లైమాక్స్ ఊరికే తేలిపోవడం
ఊహించగలిగే ట్విస్ట్
ఫైనల్‌గా: డిటెక్టివ్ భాస్కర్… ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్(2.5/5)