RGV Vyooham Review: రాజకీయ సినిమాలను తీయడంలో దర్శక–నిర్మాత రామ్‌గోపాల్ వర్మకు మంచి అనుభవం ఉంది. రాజకీయ వ్యగ్యంస్త్రాలు కూడా తీయగలడు వర్మ. ఓ సినిమాను ఏకపక్షంగాను తీయగలడు. తటస్థం గాను తీయగలడు. ఓ సినిమాను ఎలాగైన తీయగలడు వర్మ. అలా రామ్‌గోపాల్ వర్మ తీసిన తాజా పొలిటికల్ ఫిల్మ్ ‘వ్యూహం’. ఈ ‘వ్యూహం’ రెండు భాగాలుగా రానుంది. ‘వ్యూహం’కు కొనసాగింపుగా ‘శపథం’ ఉంటుంది. కాగా ఈ ‘వ్యూహం’ చిత్రం పలు వాయిదాలు, సెన్సార్స్ సర్టిఫికేట్లవివాదాల నేపథ్యంలో మార్చి 2, 2024న విడుదలైంది. మరి..ఈ ‘వ్యూహం’ సినిమా ఎవర్నీ నొప్పించింది. ఎవర్నీ ఒప్పించింది? అనేది రివ్యూలో చదివేద్దాం.
సినిమా: వ్యూహం
ప్రధాన తారాగణం: అజ్మల్, మానస, ధనుంజయ, ఎలినా
దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ
నిర్మాత: దాసరి కిరణ్‌కుమార్
సంగీత దర్శకుడు: బాలాజీ
విడుదల తేదీ: మార్చి 2, 2024
కథ
భారత పార్టీ ముఖ్యనేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వీఎస్సార్ (వీరశేఖర్ రెడ్డి) దుర్ఘనటలో మరణిస్తారు. దీంతో వీఎస్సార్ తనయుడు మదన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలన్నట్లుగా అధికారపార్టీ మెజారిటీ ఎమ్.ఎల్.ఏలు ఢిల్లీలో ఉన్న భారత పార్టీ హైకమాండ్ మేడమ్‌కి(ఏలిన)కు రిక్వెస్ట్ లెటర్ పెడతారు. కానీ తన మాటను జవ దాటని కోశయ్యను ముఖ్యమంత్రి చేస్తుంది మేడమ్. అయిదే వీఎసార్ హఠాన్మరణ వార్తను జీర్ణించుకోలేక ఈ షాక్‌లో చనిపోయిన వారిని ఓదార్చాలని మదన్ ఓదార్పు యాత్ర ప్రారంభిస్తాడు. ఇందుకు మేడమ్ విముఖత వ్యక్తం చేస్తారు. ఇది మదన్‌కు సహించదు. ఈ లోపు 2014 ఎన్నికలు సమీపిస్తాయి. రాష్ట్రంలో ప్రతిపక్షనేతగా ఉన్న వెలుగుదేశం నేత తారా ఇంద్రబాబు ఎలాగైన అధికారికంలోకి రావాలని ప్రయత్ని స్తుంటాడు. ఇందుకోసం సినీ స్టార్ శ్రవణ్కళ్యాణ్ను సాయం కొరతాడు ఇంద్రబాబు. మరోవైపు మేడమ్‌కు ఎదిరితిరిగిన మదన్ రెడ్డి వీఎస్సార్సీపీ అనే ఓ రాజకీయపార్టీని స్థాపిస్తాడు. కానీ 2014లో వెలుగుదేశం పార్టీ అధికారిన్ని చేపడుతుంది. మదన్ రెడ్డి ప్రతిపక్షనేత అవుతాడు. మరి…మదన్‌రెడ్డి భవిష్యత్‌లో సీయం అయ్యారా? మదన్‌రెడ్డి లక్ష్యాన్ని చేరుకోకుండ ఇంద్రబాబు చేసే రాజకీయ కుయుక్తులు ఏమిటి? భారత రాజకీయ పార్టీ తెలుగురాష్ట్రాల్లో హఠాత్తుగా ఎందుకు ఆదరణ తగ్గిపోయింది? అనే అంశాలు ‘వ్యూహం’లో చూడాలి
విశ్లేషణ
‘వ్యూహం’ సినిమా ఏ ఏజెండాతో రామ్ గోపాల్ వర్మ తీశారో ఆడియన్స్‌కు ఓ అవగాహన ఉంది. ‘వ్యూ హం’ సినిమాలోని అంశాలు అన్నీ పబ్లిక్ డొమైన్లోనివే కాబట్టి వర్మ తన స్టైల్ ఆఫ్ వ్యూహం సిని మాను ఏకపక్షంగా తీసినట్లుగా అనిపిస్తుంది. మదన్‌రెడ్డి సీయంగా ఉండి ఇంద్రబాబును ఓ స్కామ్‌లో జైలుకు పంపే సీన్‌తో ‘వ్యూహం’ సినిమా ప్రారంభమవుతుంది. ఈ సీన్ ‘వ్యూహం’ సినిమాకు కొనసాగింపుగా ‘వ్యూహం 2’ ‘శపథం’లోనిది. తొలిభాగం అంతా మదన్‌రెడ్డిని భారతపార్టీ మేడమ్ కావాలని రాజకీయ కక్షసాధింపుతో ఇబ్బందులు పెట్టినట్లుగా వర్మ చూపించారు. రెండో భాగం అంతా మదన్ – ఇంద్రబాబులు సీయం పదవికోసం పోటీ పడే సీన్స్‌తో నిండిపోయి ఉంటుంది. వీఎస్సార్సీపీ ఏం చేసిన ప్రజల కోసమేఅన్నట్లు, వెలుగుదేశం పార్టీ ఏం చేసిన అది ఇంద్రబాబు స్వప్రయోజనాల కోసమే అన్నట్లుగా వర్మ చూపించారు సినిమాలో. మనసేన పార్టీతో చంద్రబాబుకు సాయం చేసే వ్యక్తి శ్రవణ్ కల్యాణ్ పాత్రను వర్మ ఓహాస్యనటుడిగా చిత్రీకరించారు. ఈ సీన్స్ కాస్త కల్యాణ్ అభిమానులకు ఇబ్బందిగా ఉన్నా, ఆడియన్స్‌ను నవ్వుతెప్పించేలా చేయడంలో వర్మ కాస్త సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఇది వర్మ నమ్మిన రాజకీయ వ్యూహం అనుకోవచ్చు. నిజంగా జరిగిన ‘వ్యూహం’ కొంత ఉండొచ్చు.
పెర్ఫార్మెన్స్
మదన్‌గా అజ్మల్ అదరగొట్టాడు. తొలిపార్టులో కాస్త ఎగ్రసిస్గా కనిపించే ఈ పాత్ర, సెకండాఫ్‌లో కాస్త సెటిల్డ్‌గా ఉంటుంది. ముఖ్యంగా సంక్షేమం, అభివృద్దిల సంభాషణలు వచ్చే సెకండాఫ్‌లో అజ్మల్, మానసల యాక్టింగ్ పర్వాలేదెమో అనిపిస్తుంది. మాలతిగా మానసకు సెకండాఫ్‌లో కాస్త యాక్టింగ్ చేసే చాన్స్ కనిపిస్తుంది. ఇంద్రబాబుగా ధనుంజయ, భారతపార్టీ మేడమ్‌గా ఎలినా ఒకే. బాలాజీ సంగీతం, మనీష్ థాకూర్ ఎడిటింగ్, సాజీస్ సినిమాటోగ్రఫీ ఒకే.