Gamechanger Jaragandi: రామ్‌చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్‌చేంజర్’ సినిమా నుంచి ‘జరగండి జరగండి…’ (Gamechanger Jaragandi) పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. మార్చి 27న రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా ‘గేమ్‌చేంజర్’ సినిమాలోని ‘జరగండి జరగండి’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ‘గేమ్ చేంజర్’ నుంచి విడుదలైన తొలిపాట ఇది. కానీ ‘జరగండి జరగండి..’ పాట పూర్తి స్థాయిలో రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చిన్నట్లుగా లేదు.
శంకర్ సినిమాకు తొలిసారి మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్
‘జరగండి జరగండి..’ పాటపై ఫస్ట్ నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ‘గేమ్‌చేంజర్’ స్వరకర్త తమన్. ‘గేమ్‌చేంజర్’ దర్శకుడు శంకర్. ఒకప్పడు శంకర్ దర్శకత్వంలోని ‘బాయ్స్’ సినిమాలో ఓ లీడ్ రోల్ చేశారు తమన్. అయితే తమన్ ఆ తర్వాత టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. అలా శంకర్ నిర్మించిన ‘ఇరమ్’(తెలుగులో ‘వైశాలి’) సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేశారు. కానీ శంకర్ డైరెక్షన్లో వస్తున్న సినిమాకు తమన్ మ్యూజిక్ అందించడం ఇదే తొలిసారి. గురుదక్షిణగా తమన్ మ్యూజిక్‌తో అదరగొడతారని అందరు అనుకున్నారు. ‘గేమ్‌చేంజర్’లోని మిగతాపాటలు ఎలా ఉంటాయో తెలియదు కానీ…‘జరగండి జరగండి’ మాత్రం రామ్‌చరణ్, తమన్, శంకర్ల స్థాయిని మాత్రం అందుకోలేక పోయింది.
What's happening#Jaragandi#JaragandiJaragandiSong#RamCharan#GameChaner #Thaman#Shankar#RC15pic.twitter.com/Jhc2XZDg1l
— TollywoodHub (@tollywoodhub8) March 27, 2024
రిలీజ్ ఆలస్యమైందా?
![Ramcharan Jaragandi Song from Gamechanger](https://tollywoodhub.com/wp-content/uploads/2024/03/Ramcharan-Jaragandi-Song-from-Gamechanger-786x550.jpg)
నిజానికి ‘జరగండి జరగండి’ (Jaragandi Jaragandi Song) పాటలను గత ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. లాస్ట్ మినిట్‌లో వెనక్కి తగ్గారు. అప్పట్నుంచి ఈ సాంగ్ అదిగో వస్తోంది. ఇదిగో వస్తోంది అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలా మెల్లిగా ఈ పాటపై ఆడియన్స్‌కు ఇంట్రెస్ట్ పోయినట్లుంది. పైగా ఐదారు నెలల క్రితం ఈ పాట ముందుగానే ఆన్లైన్లో లీకైంది. ఫుల్ ఎడిట్ కానీ ‘జరగండి’ పాట వెర్షన్ విని అప్పుడే పెదవివిరిచారు కొందరు శ్రోతలు.
విజువల్స్ మాయ చేస్తాయా?
![Ramcharan Gamechanger](https://tollywoodhub.com/wp-content/uploads/2024/03/IMG-20240327-WA0033-352x550.jpg)
రామ్‌చరణ్ హిట్ మూవీ ‘మగధీర’లోని ‘జోర్సె…’ పాటను పాడినవారిలో ఓ సింగర్ అయిన డాలర్ మెహందీ ‘జరగండి జరగండి..’పాటను పాడిన సింగర్స్‌లో ఒకరు. మరొకరు సునిధి చౌహాన్ మరో సింగర్.అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. సాధారణంగా శంకర్ డైరెక్షన్‌లోని సినిమాల్లో పాటలు విజువల్‌గా కొన్నిసార్లు భలే అనిపిస్తాయి. వోకల్స్ జరగండి పాట ఇలా ఉన్నా…మరి..విజువల్స్‌గా అయిన ఆడియన్స్నుఆకట్టుకుంటుందెమో చూడాలి. 16 కోట్ల రూపాయల ఖర్చు అని కూడ అంటున్నారు. పైగా ప్రభుదేవా కొరియోగ్రాఫీ. ఈ పాటకు ఈ రెండు అంశాలు ఏమైనా హెల్ప్ అవుతాయెమో చూడాలి.
ఇంకా ఫిక్స్ కానీ రిలీజ్ డేట్?
‘దిల్’ రాజు బ్యానర్లో రానున్న 50వ సినిమా ‘గేమ్‌చేంజర్’. ‘వినయవిధేయరామ’ తర్వాత రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను ‘దిల్’, శిరీష్నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ తోడ్పాటు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదలచేయాలనుకుంటున్నారు. సెప్టెంబరులో రిలీజ్ చేస్తామని ‘దిల్’రాజు ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. కానీ ఆ అవకాశాలు కనిపించడం లేదు.
![Ram Charan Gamechanger](https://tollywoodhub.com/wp-content/uploads/2024/01/InCollage_20240117_202106520-550x550.jpg)
డిసెంబరులో విడుదల అయ్యే చాన్సెస్ ఉన్నాయి. రామ్నందన్ అనే ఓ ఐపీఎస్ ఆఫీసర్ రాజకీయ నాయకుల ఎత్తు గడలను పటాపంచలు చేస్తూ ఎన్నికలను ఎలా సవ్యంగా జరిపించాడు? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుంది. అలాగే తండ్రికి జరిగిన అన్యాయంపై కూడా రివెంజ్ తీర్చుకుంటుంటాడు రామ్నందన్. ఎలా అనేది సినిమాలో చూడాలి.