RC GameChanger: శంకర్‌తో రామ్‌చరణ్ చేస్తున్న ‘గేమ్‌చేంజర్’(RC GameChanger) చిత్రీకరణ సుధీర్ఘంగా సాగుతోంది. ‘గేమ్‌చేంజర్’ సినిమా కన్నా కూడా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ సినిమాల చిత్రీకరణ కోసమే శంకర్ ఎక్కు వ సమయాన్ని కేటాయించారు. కానీ ప్రస్తుతం శంకర్ శ్రద్ధ అంతా ‘గేమ్‌చేంజర్’ పైనే ఉంది. ఎందుకంటే ఈ మేలో విడుదల కావాల్సిన ‘ఇండియన్ 2’ చిత్రం రిలీజ్.. దేశంలో జనరల్ ఎలక్షన్స్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు రిలీజ్‌కు తొందరలేదు కాబట్టి ‘ఇండియన్ 2’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను మెల్లిగా చేసు కోవచ్చు శంకర్. లేకపోతే ‘ఇండియన్ 2’ ప్రమో షన్స్ అని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అని ‘గేమ్‌చేంజర్’ను మరింత ఆలస్యం చేసేవారెమో శంకర్.
ఇండియన్ 2 లేకపోవడంతో…
ప్రస్తుతానికి ‘ఇండియన్ 2’ గొడవ లేదు కాబట్టి కానీ ఇప్పుడు ‘గేమ్‌చేంజర్’ చిత్రీకరణను పూర్తి చేయడంపై శంకర్ దృష్టి పెట్టాడు. ఇటీవల వైజాగ్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక షెడ్యూల్ ముగిసింది. నెక్ట్స్ షెడ్యూల్ రామ్‌చరణ్ బర్త్ డే అంటే మార్చి 27 తర్వాత హైదరా బాద్‌లో జరుగుతుంది. ఇక మార్చి 27న రామ్‌చరణ్ బర్త్ డే సంద ర్భంగా ‘గేమ్‌చేంజర్’ నుంచి ‘జరగండి’ పాట రాబోతుంది. ఇలా గేమ్‌చేంజర్ షూటింగ్ త్వరగా పూర్తి కావడానికి రామ్ చరణ్ కు ఈ ఎలక్షన్స్ బాగా ఉపయోగపడ్డట్లయింది.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘గేమ్‌చేంజర్’ చిత్రం రాబోతోంది. అప్పన్న (1980 టైమ్), రామ్ నందన్ పాత్రల్లో తండ్రీకొడుకులుగా రామ్‌చరణ్ డ్యూయెల్ రోల్స్‌లో కనిపించ నున్నారు. అవినీతి, దొమ్మి, రిగ్గింగ్, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండ ఎన్నికలను ధైర్యంగా పారదర్శకంగా నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్ రామ్నందన్ పాత్రలో కనిపిస్టారట రామ్‌చరణ్.
ఎలక్షన్స్ పూర్తయిన తర్వాతే రిలీజ్
కానీ ఇంత మంచి సబ్జెక్ట్ ఉన్న ఈ చిత్రం విడుదల అయ్యేది మాత్రం ఎన్నికలు పూర్తయిన తర్వాతే. అసలు డ్రామా అంతా ప్రజలు వారి వారి స్థానిక ఎన్నికల్లోనే చూస్తారు. ఇక ‘గేమ్‌చేంజర్’ సినిమాలోని నీతి, న్యాయం, పారదర్శకత, పక్షపాతం లేక పోవడం వంటి అంశాలకు ఎలా ఏట్రాక్ట్ అవుతారనేది చిన్న ప్రశ్న. ఈ ఎన్నికల హీట్ తగ్గిన కొంతకాలం తర్వాత గేమ్‌చేంజర్ వస్తే బాగుంటుంది. కానీ మరీ ఆలస్యం అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఆడియన్స్‌కు ఇంట్రెస్ట్ తగ్గిపోవచ్చు. ఇప్పుడైతేనెమో… రియల్ ఎలక్షన్స్ ఎంటర్టైన్మెం ట్ను పొందిన ఆడియన్స్…మళ్లీ థియేటర్స్ వచ్చి రీల్ ఎంటర్టైన్మెంట్ను ఎంత వరకు ఆస్వాదిస్తారు? ఎంత మేరకు ఆదరిస్తారు? అనేది సస్పెన్స్‌నే.
‘గేమ్‌చేంజర్’ సినిమాలో అప్పన్న సరసన అంజలి, రామ్నందన్ సరసన కియారా అద్వానీ నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఎస్జే సూర్య, శ్రీకాంత్, జయ రాం, నవీన్ చంద్ర, సునీల్, ప్రియదర్శి కీలక పాత్రల్లో కని పిస్తారు. ‘దిల్’ రాజు, శిరీష్‌లు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. తమన్ స్వరకర్త.