కోలుకున్న సమంత
కొంతకాలంగా మయోసైటివ్ తో బాధపడ్డారు సమంత. ఇటీవల ఓ సందర్భంలో తన అనారోగ్యం ఆల్మోస్ట్ తొలగిపోయిందని, త్వరలో షూటింగ్స్‌తో బిజీ అవుతానని సమంత చెప్పడం గుర్తుండే ఉంటుంది. అయితే సమంత చేతిలో ప్రస్తుతం ఈ సినిమాలు ఏవీ లేవు. ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ ఇండియన్ వెర్షన్లో నటించారు సమంత. ఈ వెబ్‌సిరీస్ ఏప్రిల్‌లో స్ట్రీమింగ్కానుంది. ఇందులో వరుణ్‌ధావన్ హీరో. సమంత నటించిన తొలి వెబ్‌సిరీస్ ‘ది ఫ్యామిలీమాన్ సీజన్ 2’ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్‌కు దర్శకులు.
Samantha Ruth Prabhu: దేవతగా సమంత..గుడి కట్టిన అభిమాని
సమంత వదులకున్న ప్రాజెక్ట్స్
ఇక సమంత గతంలో సైన్ చేసిన ‘ది గాళ్‌ఫ్రెండ్’ సినిమాలో హీరోయిన్ రష్మికామందన్నా చేస్తున్నారు. హాలీవుడ్ దర్శకుడు ఫిలిప్ జాన్ తో సమంత చేయాల్సిన ‘చెన్నై స్టోరీ’ సినిమాను ప్రస్తుతం శ్రుతీహాసన్ టేకోవర్ చేశారు. ఆరోగ్యకారణాల వల్ల సమంత ఈ ప్రాజెక్ట్స్ నుంచి గతంలోనే తప్పుకున్నారు.
సమంత వయసు 23 సంవత్సరాలు
మరోవైపు ఏన్ని పనులున్నా వర్కౌట్స్ విషయంలో సమంత ఏమాత్రం కాంప్రమైజ్ కారు. చాలా ఫిట్‌గా ఉంటారు. ఇటీవల పరికరం ద్వారా సమంత టెస్ట్ చేసుకున్నారు. సమంత జీవక్రియల ప్రకారం ఆమె వయసు 23 సంవత్సరాలు అని ఆ పరికరం స్పష్టం చేసింది. ఈ ఫోటోలను కూడా సమంత షేర్ చేశారు సోషల్‌మీడియాలో. కాగా సమంత తెలుగులో నెక్ట్స్ సైన్ చేయబోయే సినిమా ఏదై ఉంటుంది? అన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొని ఉంది. అయితే ఈ ప్రకటన రావడానికి కొంత సమయం వేచి ఉండక తప్పడం లేదు.