అయితే కథ రిత్యా ఛత్రపతి శంభాజీ రాజ్య రక్షణ కోసం ఎక్కువగా యుద్ధాలు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో రాణిగా రాజకోటలో కీలక నిర్ణయాలు, రాజ్య పాలనలో సింహాభాగపు వ్యవహారాలు అన్నీ ఏసుభాయ్ చక్కబెడుతుంటారు. ఛత్రపతి మహారాణి అని ఏసుభాయ్కి పేరు ఉంది. ఎప్పుడైతే ఔరంగజేబు చేతిలో శంభాజీ దారుణమైన చావుకు గురవుతాడో అప్పుడు ఏసుభాయ్ పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా, ఎమోషనల్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ పాత్రలోనేనటించారు రష్మికా మందన్నా. అంటే…బాహుబలితో శివగామి తరహా పాత్ర అన్నమాట. హిందీలో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమాను రష్మికామందన్నా చాలా సైలెంట్‌గా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కాకుండా అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు రష్మికామందన్నా. ‘రెయిన్బో’, ‘దిగాళ్ ఫ్రెండ్’ అనే రెండు ఉమెన్‌సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు రష్మికా మందన్నా.
Rashmika Mandanna: శివగామి తరహా పాత్రలో రష్మికా మందన్నా..ఛత్రపతిరాణి
Rashmika Mandanna: ‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్ర ఎంతపవర్ఫుల్గా ఉంటుందో తెలిసిందే. ఈ తరహా పాత్రలోనే రష్మికా మందన్నా నటించారు. హిందీలో విక్కీ కౌశల్ హీరోగా ‘ఛావ’ అనే పీరియాడికల్ ఫిల్మ్ తెరకెక్కు తోంది. లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాకు దర్శకుడు. ‘జర హట్కే జర బచ్కే’ (2023) సినిమా తర్వాత విక్కీ కౌశల్, లక్ష్మణ్ ఉటేకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘ఛావ’. ఈ సినిమాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్దకుమారుడు ఛత్రపతి శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తున్నారు. ఛత్రపతి శంభాజీ భార్య ఏసుభాయ్ పాత్రలో రష్మికామందన్నా కనిపిస్తారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా విడుదలపై ఓ స్పష్టత రానుంది.
Leave a comment
Leave a comment