క్యారెక్టర్ కోసం ఎంతైనా శ్రమిస్తారు హీరోయిన్ సమంత (Samantha). ఇక యాక్షన్ సీన్స్ అయితే అస్సలు కాంప్రమైజ్ కారు. ఈ విషయాన్ని ‘ది ఫ్యామిలీమేన్ సీజన్ 2’లో రాజ్యలక్ష్మీ పాత్ర ద్వారా నిరూపించారు సమంత. ‘దిఫ్యామిలీమేన్’ వెబ్‌సిరీస్‌ను తీసిన రాజ్ అండ్ డీకే (Raj and DK)లు ప్రస్తుతం ‘సిటాడెల్’(Citadel) ఇండియన్ వెర్షన్ వెబ్‌సిరీస్ తీస్తున్నారు. స్పై థ్రిల్లర్ జానర్లో రూపొందుతున్న ఈ వెబ్‌సిరీస్‌లో వరుణ్‌ధావన్, సమంత లీడ్ రోల్స్చేస్తున్నారు.
కాగా సమంత ప్రస్తుతం ఈ ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ కోసం యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.‘ఇట్స్ టార్చర్ టైమ్..ఐస్ బాత్ రికవరీ..యాక్షన్ మోడ్ ఆన్’ అని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో షేర్ చేశారు సమంత. దీంతో ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ కోసమే సమంత ఈ యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిపోయారని ముంబైమీడియా చెబుతోంది. ఈ ప్రాజెక్ట్ కాకుండ సమంత ప్రస్తుతం ‘ఖుషి’ సినిమా చేస్తున్నారు. ఇందులోవిజయ్దేవరకొండ హీరో. శివ నిర్వాణ దర్శకత్వలో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబరు1న విడుదల కానుంది.