అభిమాన తారల కోసం ఫ్యాన్స్ ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అలా ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన సందీప్‌కు సమంత అంటే ఎంతో అభిమానం. దీంతో తనఅభిమానాన్ని చాటుకునేందుకు సమంత(Samantha Ruth Prabhu)కు çస్వగృహ ప్రాంగణంలోనే సందీప్ ఓ గుడిని నిర్మిస్తున్నాడు.ప్రస్తుతం ఈ గుడికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటి తాలుకూ ఫోటోలుసోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయిస్తూ, ఆ చిన్నారులకు పునర్జన్మను ప్రసాదించేందుకు సమంత చూపిన చొరవే తన అభిమానానికి కారణమన్నట్లుగా సందీప్ పేర్కొన్నారు.
అలాగే సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమ యంలో ఆమె ఆరోగ్యం మెరుగు పడాలని తిరుపతి, నాగపట్నం, చెన్నైలకు మొక్కుబడి యాత్రలు చేశారట సందీప్. ఈ నెల 28న సమంత బర్త్ డే. ఈ సందర్భంగా సమంత గడిని ప్రారంభించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారట సందీప్.
ప్రస్తుతం ‘ది ఫ్యామిలీమేన్’ ఫేమ్ రాజ్ అండ్ డీకేల లేటెస్ట్ వెబ్‌సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ షూటింగ్ నిమిత్తం సమంత బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈసినిమా కాకుండా సమంత ‘ఖుషి’ చిత్రం చేస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ హీరో. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబరు 1న విడుదల కానుంది. ఈ చిత్రాలతో పాటు డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్‌లో ఓ సినిమా, ఆరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ తెలుగు రీమేక్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కాగా ఈ రెండు ప్రాజెక్ట్స్‌పై మరోసారి అప్డేట్స్ రావాల్సి ఉంది.