Music Director Radhan: ‘అందాలరాక్షసి’, నాని ‘ఎవడే సుబ్రహ్మాణ్యం’, శర్వానంద్ ‘రాధా’, విజయ్‌దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’, ‘హుషారు, నవీన్పొలిశెట్టి ‘జాతిరత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి సినిమాలకు సంగీతం అందించారు రథన్.
మ్యూజిక్ డైరెక్టర్ రథన్ పనితీరు పట్ల తాజాగా ‘సిద్దార్థ్‌రాయ్’ సినిమా దర్శకుడు వి యశస్వీ అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. ‘అతడు’, ‘ఆర్య’, ‘భద్ర’, ‘లెజెండ్’ వంటి సినిమాల్లో బాలనటుడిగా చేసిన దీపక్‌సరోజ్ హీరోగా చేసిన తొలి సినిమా ‘సిద్దార్థ్‌రాయ్’. ఈ చిత్రం ఫిబ్రవరి 23, 2024న విడుదల కానుంది. కాగా ఈ సినిమా సంగీత దర్శకుడు రథన్‌పై ఈ చిత్రం దర్శకుడు యశస్వీ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘సిద్దార్థ్ రాయ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రథన్ గురించి యశస్వీ మాట్లాడటం ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ హాట్‌టాపిక్‌గామారింది. అంతేకాదు..రథన్ పనితీరు పట్ల గతంలో ‘అర్జున్‌రెడ్డి’, ‘యానిమల్’ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
Music Director Radhan : సినిమా షూటింగ్ త్వరగానే పూర్తయింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వాయిదా పడుతూ వస్తున్నాయి. మా పనులు ఆలస్యం కావడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ రథన్. నాలా ఎవరూ మోసపోకూడదని అతని గు రించి చెప్పాలనుకుంటున్నాను. రథన్ చాలా మంచి టెక్నిషియన్ అని, అతని దగ్గరకు వెళ్తున్నాం. కానీ అతని చేతిలో పడి సినిమా నలిగిపోతుంది. గొడవపడేందుకే మాట్లాడుతుంటాడు రథన్. మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం రథన్తో పెద్ద ఆర్గ్యూమెంట్ జరిగింది. షూటింగ్ లొకే షన్స్‌ను సేర్చ్ చేసే పనిలో భాగంగా మేం వైజాగ్‌కు బయలు దేరాం. రాజమండ్రిలో రథన్ ఫోన్‌కాల్ వచ్చింది. వైజాగ్ వచ్చెంతవరకూ మాట్లాడుతూనే ఉన్నాం.అంటే ఊహించుకోండి..ఏ స్థాయిలో అతనితో ఆర్గ్యూమెంట్ జరిగిందో. రథన్ సినిమాను ఓ కార్నర్‌కు తీసుకు వెళ్తాడు. రథన్ చెన్నైలో ఉండి బతికిపోయాడనుకుంటున్నాను నేను. ఒకవేళ అతను హైదరాబాద్‌లో ఉండిఉంటే పెద్ద గొడవలు జరిగేవి.
…………
‘అర్జున్ రెడ్డి’ సినిమాకు రథన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు. హర్షవర్థన్ రామేశ్వర్ ఇచ్చారు. అర్జున్‌రెడ్డి సినిమాకు మ్యూజిక్ ఇవ్వడానికి చాలా ఆలస్యం చేశాడు. మరొక నిర్మాత అయితే..రథను తొలగించే వాడేప్రాజెక్ట్ నుంచి. కానీ ‘అర్జున్‌రెడ్డి’ సినిమాకు నేను డబ్బులు పెట్టాను. పోస్టర్స్‌పై ఆల్రెడీ రథన్ అని ఉంది. ఏడు పాటలు ఉన్నాయి సినిమాలో. ఆరు పాటలకు రథన్ మ్యూజిక్ ఇవ్వాలి. ఒక్క బ్రేక్ సాంగ్ తప్ప మిగిలినవి అన్నీ రెండు నిమిషాల లోపు నిడివి ఉన్నవే. 2017 ఫిబ్రవరి 14న మేం ‘అర్జున్ రెడ్డి’ టీజర్‌ను విడుదల చేస్తే… సినిమాను 2017 ఆగస్టు 25న విడుదల చేశాం. 300 వంటి హాలీవుడ్ సినిమాలకు కూడ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌కు ఆరు నెలలు పట్టలేదు. చెప్పాలంటే…అర్జున్‌రెడ్డి సినిమాకు టీజర్ విడుదల చేసినప్పటికీ ఒక్కసాంగ్ కూడా రికార్డు పూర్తి కాలేదు. ‘రాధా’ సినిమా ప్రమోషన్స్‌కు రథన్ వస్తే నేను బతిమిలాడి రెండు పాటలు రికార్డింగ్ చేసుకున్నా. రథన్తో మాట్లాడుతుంటే సమయం గడిచిపోయింది. కొన్నిసార్లు విజయ్‌దేవరకొండ కూడా మాట్లాడాడు ఫోన్లో. రథన్ జోలికి వెళ్లవద్దని చాలామంది చెప్పారు నాకు. కానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, ప్రొడ్యూసర్స్‌కు కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉంటాయిలే అని నేను అనుకుని, రథన్‌ను ‘అర్జున్‌రెడ్డి’ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాను.