Janhvikapoor: టాలీవుడ్..బాలీవుడ్..ఇప్పుడు ఎక్కడైనా జాన్వీకపూర్ పేరు బలంగా వినిపిస్తోంది. టాలీవుడ్ అయితే జాన్వీ కపూర్(Janhvikapoor) పేరు కాస్త ఎక్కువ సౌండ్‌తో వినిపిస్తోంది. ఎన్టీఆర్‌తో జాన్వీకపూర్ ‘దేవర’ సినిమాకు సైన్ చేశారు.జాన్వీకి ‘దేవర’ తెలుగులో తొలి సినిమా. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ రామ్‌చరణ్ సినిమాలోని హీరోయిన్ చాన్స్‌ను జాన్వీ కొట్టేసిందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఈ వినికిడి ఇక్కడితో ఆగలేదు. అఖిల్ నెక్ట్స్ చేయనున్న సోషియోఫ్యాంటసీ ఫిల్మ్‌లో కూడా జాన్వీకపూర్యే హీరోయిన్ అన్న టాక్ తెరపైకి వచ్చింది. ఇలా టాలీవుడ్లో మూడు సినిమాలను జాన్వీకపూర్ హైజాక్ చేశారు. అదీ స్టార్ డమ్ ఉన్న హీరోలతో. మరోవైపు హోమ్ గ్రౌండ్లోనూ జాన్వీ జోరు ఊపందుకున్నట్లుగా ఉంది. షాహిద్‌కపూర్ నెక్ట్స్ ఫిల్మ్‌లో జాన్వీకపూర్ హీరోయిన్ అని బాలీవుడ్ కోడై కూస్తోంది. అలాగే సూర్య హీరోగా ఓం ప్రకాష్ మెహ్రా డైరెక్ట్ చేయనున్న బాలీవుడ్ ఫిల్మ్‌లోనూ జాన్వీ హీరోయిన్గా ఫిక్స్ అనే టాక్ నడస్తోంది. ఇలా జాన్వీ కెరీర్ ప్రస్తుతం ఆరు గ్యాసిప్స్..మూడు సినిమాలు అన్నట్లుగా సాగుతోంది. అలాగే టాలీవుడ్–బాలీవుడ్ దర్శక–నిర్మాతలు జాన్వీకపూర్ నామస్మరణ చేస్తున్నట్లుగా కూడా అర్థం అవుతోంది.
Yatra2 movie Review: యాత్ర 2 మూవీ రివ్యూ