Bobbydeol: బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ (Bobbydeol) ‘యానిమల్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. హిందీ ఫిల్మ్ ‘యానిమల్’ తెలుగులో డబ్బింగ్ ఫిల్మ్‌గా విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో బాబీ డియోల్ చేస్తున్న ప్రతి సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బాబీ డియోల్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అది సూర్య ‘కంగువ’ సినిమాతో. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్. కేఈ జ్ఞానవేల్ రాజా, యూవీ క్రియేషన్స్ విక్రమ్,ప్రమోద్, వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల చేయాలనుకుంటున్నారు.
https://t.co/f7h0W0GL27 pic.twitter.com/82TlSNcUsw
— TollywoodHub (@tollywoodhub8) January 27, 2024
కాగా శనివారం అంటే జనవరి 27న బాబీ డియోల్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘కంగువ’ సినిమాలో బాబీడియోల్ నటిస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే ‘కంగువ’ సినిమాలో ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో దిశాపటానీ కూడా హీరోయిన్గా నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమా యాక్టర్‌గా బాబీడియోల్‌కు, హీరోయిన్గా దిశాపటానీకి తమిళంలో తొలి చిత్రాలు. ఇక పవన్‌కళ్యాణ్ హీరోగా దర్శకుడు జాగర్లమూడి క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) దర్శకత్వంలో హరిహరవీరమల్లు’ సినిమా సెట్స్‌పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులోని విలన్ రోల్లో అంటే..కథరిత్యా ఔరంగజేబు పాత్రలో బాబీడియోల్ నటించాల్సింది. కానీ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా బాబీ డియోల్యానిమల్ ప్రమోషన్స్‌లో వెల్లడించారు. అలా తెలుగులో బాబీడియోల్ తెలుగు స్ట్రయిట్ ఫిల్మ్ కాస్త ఆలస్యమౌతోంది.