SuryaKanguva: కంగువ సినిమాను గురించి ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రచార వీడియో, లుక్ మంచి హైప్ ఇస్తున్నాయి. సూర్య మరో సాలిడ్ హిట్ కొట్టేలా ఉన్నాడుని ‘కంగువ’ (SuryaKanguva) విజువల్స్ చూసిన సగటు సినీ ప్రేక్షకుడు అనుకోవ చ్చు. కానీ ఇప్పటివరకు ‘కంగువ’ సినిమా నుంచి వీడుదలైన ఆల్మోస్ట్ ప్రతి విజువల్, ప్రతి లుక్ కేవలం సినిమాలోని ఓ పార్ట్లోనిదే. ఓకే ఒక్క లుక్ తప్ప.
కంగువా సినిమా కథ 18వ శతాబ్దంలో మొదలై, సమకాలీన పరిస్థితులను (21వ శతాబ్దం) టచ్ చేస్తుంది. ఇందులో సూర్య డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు. 18వ శతాబ్దంలో కుంగువా అనే వీరుడు ఓ అంతుచిక్కని వ్యాధితో ఎలా మరణించాడు? అదే వ్యాధి 21వ శతాబ్ధంలో ప్రబలినప్పుడు….అప్పుడు చనిపోయిన కంగువ..పునర్జన్మలో ఏం చేశాడు? అన్నదే కంగువా కథ అని ప్రచారం సాగుతోంది. కంగువగా సూర్య, ఉధిరన్‌గా బాబీడియోల్ నటించారు.
కానీ ‘కంగువా’ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన విజువల్స్ ప్లాష్‌బ్యాక్ ఏపిసోడ్ సీన్స్ మాత్రమే. ప్రజెంట్ సీన్స్‌కు సంబంధించిన వీడియో ఏదీ బయటకు రాలేదు. గోవాలో దిశాపటానీ, సూర్యలపై దాదాపు నెలరోజులకుపైగా షూటింగ్ చేశారు. చెన్నై పోర్టు, సబ్స్టేషన్స్ ఏరియల్లోనూ షూటింగ్ జరిగినట్లు తెలిసింది.
ఈ విజువల్స్‌ను ఇప్పుడు దాస్తూ.. కేవలం ప్లాష్‌బ్యాక్ సీన్స్ వీడియోలను మాత్రమే విడుదల చేస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు మేకర్స్. ఈ విజువల్స్ కూడా వస్తే సినిమాపై మరింత అవగాహన కలుగుతుంది. నిజానికి తెలుగులో వచ్చిన ‘మగధీర’, ‘బింబిసార’ తరహాలో ‘కుంగవ’ చిత్రం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.
కంగువ సినిమా రెండు పార్టులుగా విడుదల అవుతుందనే ప్రచారం సాగుతోంది. తొలిపార్టును ఈ ఏడాది ఏప్రిల్‌లో అంటే…తమిళ సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్ 12న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు.
ఇప్పుడు రిలీజ్ డేట్‌పై స్పష్టత లేదు.
SuryaPuranaanooru: హీరో సూర్యకు మరో ఎదురుదెబ్బ!
యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. ఈ సినిమాను అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నారు. త్రీడీ వెర్షన్లోను ఈ చిత్రం విడుదల కానుంది. ఇందుకే సినిమా రిలీజ్ ఆలస్యం అవు తుందెమో.