‘ది ఫ్యామిలీమేన్ సీజన్ 2’ వెబ్‌సిరీస్‌లో రెబల్ క్యారెక్టర్ రాజ్యలక్ష్మీగా సమంత అదరగొట్టారు. చెప్పాలంటే యాక్షన్ సీన్స్‌ను ఇరగదీశారు. సమంతలోని ఈ ఫెర్ఫార్మెన్స్, స్టామినాను చూసేనెమో…తమ మరో సిరీస్ ‘సిటాడెల్: హానీబన్నీ’లోనూ సమంతకు చాన్స్ ఇచ్చారు దర్శకద్వయం రాజ్ అండ్ డీకే (ఫ్యామిలీమేన్ సిరీస్ దర్శకులు). హాలీవుడ్లో రూసోబ్రదర్స్ తీసిన ‘సిటాడెల్’కు ఇండియన్ వెర్షన్‌గా ‘సిటాడెట్:హనీ బన్నీ’ వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ రానుంది. వరుణ్‌ధావన్, సమంత లీడ్ రోల్స్ చేశారు.
ఇక సమంత ఆశల్నీ హనీబన్నీపైనే ఉన్నాయి. ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్ కూడా. మయో సైటిస్ వ్యాధి కారణంగా కొన్ని రోజులు సినిమాలు చేయలేదు సమంత. ఈ వ్యాధి నుంచి పూర్తి స్థాయిలోకోలుకున్న తర్వాత సమంత నుంచి వస్తోన్న తొలి ప్రాజెక్ట్ ఇది. పైగా తనకు అనారోగ్యం ఉన్నా కానీ…కష్టపడి ఈ వెబ్‌సిరీస్‌ను కంప్లీట్ చేశారు సమంత. ఈ విషయాన్ని సమంత రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘సీటాడెల్: హనీబన్నీ’ సిరీస్ రెస్సాన్స్పైనే సమంత భవిష్యత్‌లో సైన్ చేయబోయే సినిమాల సంఖ్య ఆధారపడి ఉంది. మరి..సిటాడెట్ సమంతకు మళ్లీ పూర్వవైభవాన్ని తెచ్చి పెడుతుందా?లెట్స్ వెయిట్ అండ్ సీ.