VaruntejGhani: వరుణ్‌తేజ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా ‘గని’. అల్లు బాబీ, సిద్దు ముద్దా నిర్మించిన ఈ చిత్రంతో దర్శకుడిగా కిరణ్ కొర్రపాటి, హీరోయిన్గా సాయిమంజ్రేకర్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. పవన్‌కళ్యాణ్ ‘బాలు’ (2005) సినిమాలోని క్యారెక్టర్ ‘గని‘ పేరును వరుణ్‌తేజ్ సినిమాకు పెట్టడం అప్పట్లో మెగాఫ్యాన్స్కు ఖుషీ నిచ్చింది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ నటుడు సునీల్శెట్టిలు కీలక పాత్రల్లో నటించారు. వీరిద్దరు ‘గని’లో భాగం కావడం ఈ సినిమాకు ఫ్లస్ అని భావించారు. కానీ ‘గని’ సినిమా వరుణ్‌తేజ్ కెరీర్లో ఓ డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ విషయంపై ఈ చిత్రం నిర్మాత సిద్దు ముద్దా స్పందించారు. ”వరుణ్‌తేజ్‌తో నేను తొలిసారిగా ‘గని’ సినిమా తీశాం. 2022 ఏప్రిల్‌లో ‘గని’ విడుదలైంది. అప్పటికే మా సినిమా దురదృష్టవశాత్తు పలుమార్లు వాయిదా పడింది. దీంతో ఆడియన్స్‌కు ‘గని’ సినిమా పట్ల కాస్త ఆసక్తి తగ్గినట్లుగా అనిపించింది. పైగా ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్’ సినిమాల మధ్యలో మా సినిమా విడుదల కావాల్సి వచ్చింది. ఇలా ‘గని’ సినిమా ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది” అని చెప్పుకొచ్చారు.
వరుణ్‌తేజ్, సిద్దు ముద్దాల కాంబినేషన్లో తాజాగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం తెరకెక్కింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుల్వామా ఘటన ఆధారంగా ఈ సినిమాను తీశారు. సోనీ ఇంటర్నేషనల్ పిక్చర్స్ సంస్థ కూడా ఈ సినిమాలో భాగమైంది. బాలీవుడ్ హీరోయిన్ మానుషీ చిల్లర్ ఈ చిత్రంతో టాలీవుడ్‌కు వస్తున్నారు. పుల్వమా ఘటనపై బాలీవుడ్లో హృతిక్ రోషన్ ‘ఫైటర్’ సినిమా తీసిన ఆడలేదు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌తో తెలుగు, హిందీ భాషల్లో వరుణ్‌తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తీశారు. పైగా వరుణ్‌తేజ్‌కు బాలీవుడ్లో ఇది తొలి సినిమా. అలాగే రీసెంట్ టైమ్స్‌లో వరుస ప్లాఫ్స్తో ఇబ్బంది పడుతున్నారు వరుణ్‌తేజ్. సో..ఈ సినిమా వరుణ్ కెరీర్‌కు చాలా కీలకం. ఈ చిత్రం మార్చి 1న విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాపై సిద్దు ముద్దా మాట్లాడారు. ”ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాను 42 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీశాం. ఐదు కోట్ల రూపాయలు వీఎఫ్ఎక్స్కే ఖర్చు అయ్యాయి. శక్తి ప్రతాప్‌సింగ్ ఓ షార్ట్ ఫిల్మ్ తీశారు పుల్వామా ఘటనపై. ఈ షార్ట్ ఫిల్మ్‌నే సినిమాగా తీశాం. ఏరియల్ యాక్షన్ డ్రామా ఇది. తెలుగు, హిందీ భాషల్లో తీశాం. నాన్-థియేట్రికల్ బిజినెస్ పూర్తయింది. నాలుగు వారాల తర్వాత తెలుగు వెర్షన్, ఎనిమిది వారాల తర్వాత హిందీ వెర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రైమ్ వీడియో సంస్థ మా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను తీసుకుంది. నితిన్‌తో ఓ మంచి ప్రాజెక్ట్ అనుకుంటున్నాం. త్వరలోనే చెబుతాం” అని చెప్పుకొచ్చారు సిద్దు ముద్దా.