Varuntej:హీరో వరుణ్‌తేజ్ హీరోగా నటించిన రీసెంట్ ఫిల్మ్ ‘గని’. కిరణ్‌కొర్రపాటి దర్శకత్వంలో బ్యాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదలైంది. అయితే ఈ సినిమాకు ఊహించనంత స్పందన ప్రేక్షకుల నుంచి రాలేదు. దీంతో ప్లాప్‌గా నిలిచింది. వరుణ్‌తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొం దిన ఫిల్మ్ ఇది. ‘గని’ సినిమాకు దాదాపు 35 కోట్ల బడ్జెట్ కాగా, కేవలం 10 నుంచి 15 కోట్లు మాత్రమే వసులు చేయగలిగింది. దీంతో వరుణ్‌తేజ్ కెరీర్‌లోని ఫ్లాప్‌మూవీ జాబితాలో ‘గని’ చేరింది. కాగా ‘గని’సినిమా విషయంలో అభిమానులను నిరాశపర చినందుకు క్షమాపణులు కోరుతూ వరుణ్‌తేజ్ ఓ లెటర్‌నురిలీజ్ చేశాడు. ‘గని’ సినిమా కోసం ఎంతో కష్టపడ్డామని, కానీ ఎగ్జిక్యూజన్‌లో ఎక్కడో పొరపాటు జరిగిం దన్నట్లుగా చెప్పుకోచ్చాడు వరుణ్‌తేజ్. అలాగే ఇకపై అభిమానుల కోసం మరింత కష్టపడతానన్నట్లుగా కూడా వరుణ్ చెప్పుకొచ్చారు. అయితే తన సినిమా బాగా ఆడలేదు అన్న విషయాన్ని ఇలా బహిరగంగా లేఖ విడుదల చేయడం పట్ల వరుణ్‌ను నెటిజన్లు, ఇండస్ట్రీ జనాలు మెచ్చుకుంటున్నారు. ఓటమిని జీర్ణించుకులేక కుమిలిపోయే హీరోల కంటే వరుణ్ ఇలా ధైర్యంగా మాట్లాడటం గొప్ప విషయమని చెప్పు కొస్తున్నారు నెటిజన్లు.


Varuntej Ghani: యాక్షన్ హీరో కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను
— Varun Tej Konidela (@IAmVarunTej) April 12, 2022
ఇక వరుణ్‌తేజ్ హీరోగా ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కూడా ఫుల్ యాక్షన్ ఫిల్మ్. ప్రస్తుతం ప్రవీణ్‌సత్తారు ‘ఘోస్ట్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి రాగానే వరుణ్‌తేజ్‌తో సినిమాను స్టార్ట్ చేస్తారు ప్రవీణ్. అయితే దాదాపు మూడు సంవత్సరాల క్రితం రామ్‌తో ఓ యాక్షన్ ఫిల్మ్‌ను ప్రకటించి ఆ తర్వాత ఆ సినిమాను ఆపేశారు ప్రవీణ్‌సత్తారు. ఇదిక్యాన్సిల్ అయ్యింది. ఈ సినిమా స్క్రిప్ట్‌తో ప్రవీణ్‌సత్తారు ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో సినిమా చేస్తున్నారన్న వార్తలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
https://twitter.com/IAmVarunTej/status/1508295489548353536