Acharya: విడుదలైన ‘ఆచార్య’ సినిమా ట్రైలర్ మెగాఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. చిరంజీవి హీరోగా నటిం చిన సినిమా ఇది. కొరటాల శివ దర్శకుడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేసిన ఈ ఫిల్మ్‌లో రామ్‌చరణ్, పూజ, సోనూసూద్ కీలక పాత్రధారులు. ఏప్రిల్ 29న ఈ సినిమా రిలీజ్ కానుంది. పాదఘట్టం అనే ప్రాంతంలోని ధర్మస్థలి అనే ఫిక్షనల్ విలేజ్‌లో ‘ఆచార్య’ సినిమా కొనసాగుతుంది. ఇప్పటికే విడుదలైన ‘ఆచార్య’
ట్రైలర్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. మరో విశేషం…ఏంటంటే..‘ఆచార్య’ సినిమా నుంచి మరో ట్రైలర్ కూడా రాబోతుంది. ఏప్రిల్ 24న హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్‌గ్రౌండ్స్‌లో ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్‌లోనే ఆచార్య రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తారు. టీజర్, ట్రైలర్ యాక్షన్‌గా ఉంటే రిలీజ్ ట్రైలర్ మాత్రం ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక ఆచార్య సినిమా హైలైట్స్ విషయానికి వస్తే…
–‘మగధీర’, ‘బ్రూస్ లీ, ‘ఖైదీనంబరు 150’ చిత్రాల్లో చిరంజీవి, రామ్‌చరణ్‌లను స్క్రీన్‌పై కొంతసేపు మాత్రమే చూడగలిగారు. కానీ ‘ఆచార్య’ చిత్రం మెగాఫ్యాన్స్‌కు బిగ్ ఫీస్ట్ అనే చెప్పవచ్చు.
Nagachaithanya 22: ఆ తమిళ దర్శకుడితోనే కమిటైన నాగచైతన్య
– ఆచార్యలోని ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో రామ్‌చరణ్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చే ఓ పాట, ఓ ఫైటు అదరహో అనిపిస్తాయి.
-ఆచార్య సినిమాలో గుడి దగ్గర, ధర్మస్థలిలో చిరంజీవి చేసే ఫైట్ వన్నాఫ్‌ది బెస్ట్ హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు
Director Harish Shankar: సల్మాన్‌ఖాన్‌తో గబ్బర్‌సింగ్ డైరెక్టర్!
–‘ఆచార్య’ సినిమాలో ధర్మస్థలిలో జరిగే ఓ జాతర టైమ్‌లో రామ్‌చరణ్ ఫైట్ మరో హైలైట్
– ‘ఆచార్య’ సినిమాలోనే రామ్‌చరణ్‌కు, సోనూసూద్‌లకు మధ్య ఉండే కుస్తీ ఫైట్ మాస్ ఫ్యాన్స్‌కు విజువల్ ఫీస్ట్
– ఇక చిరంజీవి, రెజీనా కలిసి చేసిన స్పెషల్‌సాంగ్ ‘శానకష్టం’ ఉండనే ఉంది.
– మణిశర్మ సంగీతం మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు మరీ.