Nagachaithanya 22: హీరో నాగచైతన్య, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందనే వార్తలు ఎప్పట్నుంచో వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ వార్తలే నిజమైయ్యాయి. వీరి కాంబినేషన్లో రూపొందనున్న సినిమాను గురించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను (Nagachaithanya 22) నిర్మిస్తారు. ఇక ఈ సినిమా వెంకట్ ప్రభు దర్శకత్వంలోనే వచ్చిన ‘మనాడు’ సినిమాకు తెలుగు రీమేక్ అనే వార్తలు వస్తు న్నాయి. కానీ ఇది కొత్త స్క్రిప్ట్ అని సమాచారం. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నటించిన ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్‌కు రెడీగా ఉంది. తనతో థ్యాంక్యూ, మనం సినిమాలను అందించిన దర్శకుడు విక్రమ్ కుమార్‌తోనే నాగచైతన్య ‘దూత’ అనే హారర్ బేస్డ్ వెబ్‌సిరీస్ చేస్తున్నారు. ఇది నాగచైతన్యకు తొలి వెబ్ సిరీస్. ఇక నాగచైతన్య హిందీలో నటించిన తొలి చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’ ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుంది. ఆమిర్‌ఖాన్ ఇందులో హీరో. ఈ చిత్రం ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్‌గంప్’కు తెలుగు రీమేక్.
మాట నిలబెట్టుకున్న హీరో నాగార్జున, వేయి ఎకరాలకు పైగా అటవీ భూమి దత్తత
God is kind.. with the blessings of almighty and my fans I am happy to announce my next, a bilingual film (tamil & telugu) with my brother @chay_akkineni produced by @SS_Screens @srinivasaaoffl #NC22 #VP11 #SSS10 pic.twitter.com/alYcE9mQB4
— venkat prabhu (@vp_offl) April 6, 2022