vijay66: ప్రముఖ తమిళ హీరో విజయ్ తెలుగులో చేస్తున్న తొలి స్ట్రయిట్ ఫిల్మ్ ప్రారంభోత్సవం చెన్నైలో జరిగింది. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తారు. ‘దిల్’ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించనున్నారు. తెలుగు, తమిళం భాషల్లో రూపొందనున్నఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఏప్రిల్ 6 నుంచి ప్రారంభమైంది. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్.దర్శకడు అహిషోర్ సాల్మన్ (వైల్డ్‌డాగ్) ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మరోవైపు విజయ్‌హీరోగా నటించిన లేటేస్ట్ ఫిల్మ్ ‘బీస్ట్’ ఏప్రిల్ 13న రిలీజ్ కానుంది. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించినఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ‘బీస్ట్’ సినిమాకు ఒకరోజు తర్వాత అంటే ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 థియేటర్స్‌కు రానుంది.
Nithiin Macherla Niyojakavargam:కలెక్టర్ సిద్దార్ధ్ వచ్చారు