Nithiin Macherla Niyojakavargam: నితిన్ హీరోగా ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో గుంటూరు కలెక్టర్ సిద్దార్థ్ రెడ్డి పాత్రలో కనిపిస్తారు నితిన్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. భీష్మ, మ్యాస్ట్రో చిత్రాల తర్వాత వరుసగా మూడోసారి మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మేజర్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న మాచర్ల నియోజవర్గం సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.