హీరో ఆదిపినిశెట్టి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హీరోయిన్ నిక్కీ గల్రానీతో కలిసి ఏడడుగులు వేయనున్నాడు. మార్చి 24న వీరి నిశ్చితార్థం జరిగింది. ‘‘మేం ఇద్దరం ఒకరికోసం ఒకరం అని రెండు
సంవత్సరాల క్రితమే తెలుసుకున్నాం. ఇప్పుడు అందరికీ అధికారికంగా చెబుతున్నాం’’ అంటూ నిశ్చితార్థం
ఫోటోలను షేర్ చేశారు ఆది, నిక్కీ. ఇక 2020లో ఆదిపినిశెట్టి తండ్రి దర్శకుడు రవిరాజా పినిశెట్టి బర్త్ డే
సెలబ్రేషన్స్‌లో హీరో ఆదితో కలిసి సందడి చేశారు నిక్కీ. ఈ సమయంలోనే వీరి వివాహంపై రుమర్లు వచ్చాయి.ఇప్పుడు ఈ వార్తలే నిజం అయ్యాయి. ఇక ఆది, నిక్కీ కలిసి 2015లో తొలిసారిగా ‘మలుపు’ (తమిళం లో ‘యాగవరాయినమ్ నాకాక్క’) సినిమా కోసం కలిసి వర్క్ చేశారు. ఆ తర్వాత 2017లో మరకతమణి చిత్రం కోసం కలిసి చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరు ప్రేమలో వలయంలో బంధి అయ్యారు.
ఒకరికి ఒకరు
Leave a comment
Leave a comment