చిత్రం : ఆర్‌ఆర్‌ఆర్ (రౌద్రం..రణం..రుధిరం)
ప్రధాన తారాగణం: ఎన్టీఆర్, రామ్‌చరణ్, అజయ్‌దేవగన్, ఆలియాభట్, రే స్టీవెన్‌సన్, ఆలిసన్ డూడీ, శ్రియ, ఓలివియా మోరిస్
దర్శకుడు: రాజమౌళి
కథ: కేవీ విజయేంద్రప్రసాద్ (రాజమౌళి తండ్రి)
నిర్మాత: డీవీవీ దానయ్య (డీవీవీఎంటర్‌టైన్మెంట్స్)
సంగీతం: ఎమ్‌ఎమ్ కీరవాణి
సినిమాటోగ్రఫీ: కేకే సెంథిల్‌కుమార్
బడ్జెట్: 550 కోట్లు
విడుదల తేదీ: 2022 మార్చి 25
RRR Review: బాహుబలి వంటి సూపర్‌డూపర్ బ్లాక్‌బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రౌద్రం.. రణం..రుధిరం’(ఆర్‌ఆర్‌ఆర్). ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రూపొందినఈ మల్టీస్టారర్‌మూవీపై ఇటు ప్రేక్షకుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీం, అల్లూరి సీతారామరాజుల జీవితాల స్ఫూర్తితో రాజమౌళి ఆర్‌ఆర్ ఆర్‌సినిమా కథను అల్లుకున్నారు. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. పైగా పెద్ద ప్యాన్స్‌బేస్ ఉన్న ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల క్యారెక్టర్స్‌ను రాజ మౌళి ఎలా బ్యాలెన్స్ చేసి ఉంటారు? అన్న అంశం కూడా ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్‌గా నిలిచింది. మరి…స్టార్స్ క్యారెక్టర్స్‌ను బ్యాలెన్స్ చేయడంలోరాజమౌళి ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఎటువంటి వివదాలు రాకుండా కొమురం భీం, అల్లూరిసీతరామరాజు పాత్రలను రాజమౌళి ఎంతవరకు టేకప్ చేశారు? రామ్ పాత్రలో రామ్‌చరణ్, భీమ్ పాత్రలో ఎన్టీఆర్ మా పాత్రలకు ఎంత వరకు న్యాయం చేశారు? అన్న విషయాలను రివ్యూలో చదివేద్దాం. (RRR Review)


కథRRR Review: నైజాం నవాబును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ గవర్నర్ స్కాట్ (రే స్టీవెన్‌సన్), లేడీ స్కాట్ (అలిసన్ డూడీ) గోండు జాతికి చెందిన మల్లి అనే అమ్మాయిని బలవంతంగా తీసుకుని వెళ్తారు. తన చేతికి అందమైన నెమలి టాటు వేసిన మల్లిని తన వెంట తెచ్చుకుని సపర్యలు చేయించుకుంటూ ఆనందం పొందుతుంటుంది లేడీ స్కాట్. మల్లిని తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు చేర్చేందకు ఈ గోండు జాతికి కాపరి అయిన భీమ్ మారుపేరు అక్తర్‌తో ఢిల్లీకి మకాం వేస్తాడు. మరోవైపు తన తండ్రి వెంకట రాఘవ రామరాజు (అజయ్ దేవగన్)కు ఇచ్చిన మాట కోసం, తన తండ్రి ఆశయ స్ఫూర్తిని ముందుకు తీసుకుని వెళ్లడం కోసం రామరాజు బ్రిటిషర్స్ దగ్గర పోలీసాఫీసర్‌గా వర్క్ చేస్తుంటాడు. బ్రిటిష్ ఉన్నత అధికారికా పదోన్నతిని పొంది ఆయుధ భాండాగారం (ఆయుధాలను దాచే చోటు) నుంచి ఆయుధాలను దొంగిలించి తన ఊరికి తీసుకుని వెళ్లాలి అనేది రామ రాజు ప్లాన్. అయితే రామరాజు ఏం చేసిన బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం అతనికి పదోన్నతిని కల్పించదు. అయితేఇదే సమయంలో స్కాట్‌కు గొండుజాతి కాపరి నుంచి ప్రమాదం పొంచి ఉందని తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకోవాలనుకుంటుంది. తన లక్ష్య సాధన కోసం బ్రిటిష్ ప్రభుత్వ నుంచి ఉన్నతాధికారిగా పదోన్నతి పొందాలనే ఆశతో రామారాజు భీమ్‌ను పట్టుకునే బాధ్యతను తీసుకుంటాడు. ఈ క్రమంలోనే అక్తర్ టీమ్‌లో ఒకరు రామరాజుకు చిక్కి చిక్కనట్లే చేజారిపోతాడు. అతన్ని వెతుకుతున్నప్పుడు ఆపదలో చిక్కుకున్న ఓ అబ్బాయిని కలిసి కాపాడతారు రామరాజు, అక్తర్. అప్పుట్నుంచి వారి స్నేహం మొదలై బలపడుతుంది. అయితే ఈ ఇద్దరు వారి లక్ష్యాలను మాత్రం మర్చి పోరు. రామరాజు తన ప్రయత్నంలో భాగంగా తాను వెతుకున్న గోండు జాతి రక్షకుడు తన స్నేహితుడు అక్తరే అని, అతని పేరు భీమ్ అని తెలుస్తుంది. ఇటు రామరాజు మాములు వ్యక్తి కాదని బ్రిటిష్ పోలీసాఫీసర్ అని, మల్లిని తిరిగి తీసుకుని వెళ్లేందుకు అతడే అడ్డంకి అని తెలుస్తుంది. ఈ సమయంలో ఈ ఇద్దరు తమ స్నేహాన్ని నిలబెట్టాలనుకున్నారా? లేక లక్ష్యాల కోసం స్నేహాన్ని కాదనుకోని ఒకరిపై ఒకరు కాలుదువ్వారా? ఈ ఇద్దరు ఒకరికొకరు శత్రువులగా, ఆ తర్వాత మళ్లీ మిత్రులుగా ఎలా మారారు? అసలు..ఈ ఇద్దరి సయోధ్యకు సంధి చేసింది ఎవరు? అన్న అంశాలలే మిగిలిన కథ. దీన్ని వెండితెరపై మాత్రమే చూడాలి.
RRR: ఆర్‌ఆర్‌ఆర్ ఈ గండాలను దాటేనా?. .మైనస్‌లు ఇవేనా?


ఎలా ఉందంటే…రాజమౌళి మరోసారి తన అద్భుత దర్శకత్వ ప్రతిభను చూపారు ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను అద్భుతంగా తీశారు. ఫస్ట్ వచ్చే రామ్‌చరణ్ ఇంట్రడక్షన్ సీన్, ఆ నెక్ట్స్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్స్ విజువల్‌గా అదిరి పోతాయి. ముఖ్య ంగా ఎన్టీఆర్ ఇంట్రో సీన్ అయితే ఫ్యాన్స్ పూనకాలే. హీరోల ఇద్దరి ఇంట్రో సీన్స్ కంప్లీటైపోగానే కథ మొదల వుతుంది. భీమ్(ఎన్టీఆర్) లక్ష్యం ఏంటో స్పష్టంగా ముందే చెప్పిన దర్శకుడు, రామరాజు(రామ్‌చరణ్) లక్ష్యాన్ని మాత్రం సస్పెన్స్‌గా ఉంచుతాడు. ఇది సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి కలిగించేలా ఉంటుంది. ఇక తాను వెతుకున్న వ్యక్తి తన స్నేహితుడు అక్తరే అని తెలుసుకునే సమయానికి ముందు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయి. ముఖ్యంగా ‘నాటు నాటు’ సాంగ్ థియేటర్స్‌లో ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపుతుంది. అలాగే దోస్తీ సాంగ్ కూడా భలేగా ఉంటుంది. ఇక ప్రీ ఇంట్రవెల్‌లో సీన్స్‌లో చరణ్ యాక్టింగ్, ఇంట్రవెల్ బ్యాంగ్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మధ్య ఫైట్ సీన్ అయితే మాటల్లో చెప్పలేం. ఈ విజువల్ ట్రీట్‌ను స్క్రీన్‌పై చూసి ఎంజాయ్ చేయాల్సిందే. ఇక సెకండాఫ్ స్టార్టింగ్‌లోనే ఎన్టీఆర్ కొమురం భీముడో సాంగ్ సినిమాకే ఓ హైలైట్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత భీమ్ తప్పించేందుకు రామరాజు ఎలాంటి ప్లాన్ వేశాడు? ఆ ప్లాన్‌ను పసిగట్టిన స్కాట్ ఏం చేశాడు? రామరాజు లక్ష్యం గురించి తెలుసుకున్న భీమ్, అతన్ని బ్రిటిష్ జైలు నుంచి ఎలా విడిపించాడు? అన్న సీన్స్‌తో సెకండాఫ్ ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్‌లో ఈ ఇద్దరు కలిసి స్కాట్‌పై చేసే ఫైట్‌తో సినిమా కంప్లీట్ అవుతుంది. సెకండాఫ్‌లో వచ్చే కొమురం భీముడో, రామం రాఘవం సాంగ్స్ రెండు ఎమోషనల్ సాంగ్సే. కాబట్టి ఫైనల్‌గా ఎత్తర జెండా సాంగ్ టైటిల్ కాడ్స్ ఎండింగ్‌లో వస్తుంది.
RRR: వారందరూ ఏమైయ్యారు?


ఎవరు ఎలా చేశారు?యాక్టింగ్, కష్టం పరంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు ఒకరికొకరు పోటీ పడి చేశారు. అయితే క్యారెక్టర్ పరంగా రామ్‌చరణ్ క్యారెక్టర్ రామరాజులో వేరియేషన్స్ ఉన్నాయి. పైగా సినిమాలో వచ్చే అజయ్‌దేవగన్ ప్లాష్‌బ్యాక్‌ఎపిసోడ్ కూడా రామ్‌చరణ్ క్యారెక్టర్‌కే లింకై ఉంటుంది. దీంతో పోలీసాఫీసర్‌గా, ఖైదీగా, అల్లూరి సీతారామరాజుగా ..ఇలా మూడు వేరియేషన్స్ రామ్‌చరణ్ క్యారెక్టర్‌లో కనిపిస్తాయి. అలాగే భీమ్ క్యారెక్టర్‌ను ఫస్టాఫ్‌లో, క్లైమాక్స్‌లో రామ్‌చరణే (రామరాజు) డ్రైవ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అలాగే భీమ్ జట్టులోని వ్యక్తి తనపై పాము విసిరి చంపాలనుకుంటాడు. ఆ సమయంలో రామ్‌చరణ్ చేసే యాక్టింగ్ అదిరిపోతుంది. ఒక పక్క ఊరికి వచ్చిన మాట కోసం స్నేహితుడి ప్రాణాలను సైతం పణంగా పెట్టలేక రామ్‌చరణ్ పడుతున్నతపన సిల్వర్‌స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ కూడా ఏం తక్కువ కాదు. ఒలివియా మోరిస్ సాయంతో స్కాట్‌కు ఇంటికి వెళ్లినప్పుడు ఎన్టీఆర్, మల్లికి మద్య వచ్చే సీన్స్ ఫుల్ ఎమోషనల్‌గా ఉంటాయి. అలాగే సెకండాఫ్‌లో వచ్చే ఆలియాభట్, ఎన్టీఆర్‌ల మధ్య సన్నివేశాలు బాగుంటాయి. ఇక ఆలియా పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ సీతగా ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం. ఉన్నంతలో ఆలియా బాగా నటించారు. ఇక అజయ్ దేవగన్, శ్రియ యాక్టింగ్ ప్లాష్‌బ్యాక్ వరకే పరిమితం అవుతుంది. అయినా ఉన్నంత పరిధిలో అజయ్‌దేవగన్ బాగా నటించారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో అజయ్‌దేవగన్‌కు ఒక్క కాంబినేషన్ సీన్స్ కూడా లేదు. ఇక రాజమౌళి ప్రతిభను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల క్యారెక్టర్స్‌ను వీలైనంతగా బ్యాలెన్స్ చేశాడు. రెండు మెయిన్ క్యారెక్టర్స్‌తోనే దాదాపు మూడు గంటలు థియేటర్స్‌లో ఆడియన్స్‌ను ఆసక్తిగా కూర్చొబెట్టడం అనేది చిన్న విషయం కాదు. ఇక కీరవాణి సంగీతం ఆర్‌ఆర్‌ఆర్‌కు మరో హైలైట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్రో సీన్స్ అప్పుడు బ్యాగ్రౌండ్ మ్యూజిక్, కొమురం భీముడో సాంగ్, క్లైమాక్స్‌లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్. ఇక కెమెరామ్యాన్ సెంథిల్‌కుమార్ పనిని మెచ్చుకుని తీరాల్సిందే. విజువల్ ట్రీట్ అదిరిపోతుంది.
RRR Rajamouli: ఆ విషయంలో అబద్ధం చెప్పాను

