హీరో వరుణ్‌తేజ్ కెరీర్లో ఫస్ట్‌టైమ్ చేసిన స్పోర్ట్స్ ఫిల్మ్ ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన విలేకర్ల సమావేశంలో వరుణ్‌తేజ్ మాట్లాడారు. ఆ విశేషాలు…
– మిస్టర్ సినిమా సమయంలో కిరణ్ కొర్రపాటిని కలిశాను. తర్వాత నా తొలిప్రేమ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. అయితే వెంకీ కొత్త దర్శకుడు కాబట్టి కొంత అనుభవం ఉన్న కో డైరెక్టర్ కావాలని కిరణ్‌ను తీసు కోమని నేను చెప్పాను. అలా తొలిప్రేమ సినిమా షూటింగ్ చివర్లో కిరణ్‌తో సినిమా చేయాలని డిసైడైపోయాను.
– హాలీవుడ్లో యాక్షన్ ఫిల్మ్ రాకీ ప్రాంచైజీ సినిమాకు నేను పెద్ద అభిమానిని. హాలీవుడ్లో చాలా స్పోర్ట్స్ ఫిల్మ్స్ ఉన్నాయి. బాలీవుడ్‌లోనూ బాక్సింగ్ నేపథ్యంలో సినిమాలు ఉన్నాయి. తెలుగులో కూడా బాక్సింగ్బ్యాక్డ్రాప్ సినిమా ఉంటే బాగుంటుందని నాకనిపించింది చేశాను. పవన్బాబాయ్ తమ్ముడు, శ్రీహారిగారి భద్రాచలం సినిమాలంటే నాకు చాలా ఇష్టం. కథ విషయానికి వచ్చినప్పుడు బ్యాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ అయితే బాగుంటుందని అనుకున్నాం. తెలుగులో స్పోర్ట్స్ ఫిల్మ్స్ వచ్చి కొన్ని రోజులు అయ్యింది. దీంతో బాక్సింగ్ నేపథ్యంలోనే సినిమా చేయాల నుకున్నాం. పాయింట్‌ను మాత్రమే నేను చెప్పాను. పూర్తి కథను కిరణ్‌నే రెడీ చేసుకున్నాడు.
– గని సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసిన వెంటనే 2020 జూలై 30న రిలీజ్ చేస్తామని ప్రకటించాము. కానీ కోవిడ్ కారణంగా చాలాసార్లు మా సినిమా వాయిదా పడింది. నిర్మాతలుగా నా కజిన్స్ అల్లు బాబీ, సిద్దుముద్దలకు, దర్శకుడు కిరణ్‌కు, హీరోయిన్ సయీ మంజ్రేకర్‌లకు ఇదే ఫస్ట్ సినిమా. దీంతో రిలీజ్ విషయంలో కాస్త టెన్షన్‌కు లోనయ్యాం. అయితే మా సినిమా రిలీజ్ కొన్ని సినిమాల కారణంగా వాయిదా పడిందన్నవిషయం నా పరిధిలో లేదు. సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం నిర్మాతల ఇష్టం. అలాగే అందరు కొత్తవారు కాబట్టి నేను కాస్త ఎక్కువగా బాధ్యత తీసుకున్నాను.
– గని సినిమా కోసం ఫిజికల్‌గా చాలా కష్టపడ్డాను. గద్దలకొండ గణేష్ సినిమాముందకే యూఎస్ వెళ్లి అక్కడ బాక్సింగ్ ట్రైనింగ్‌ను స్టార్ట్ చేశాను. గద్దలకొండ గణేష్ సినిమా పూర్తయిన తర్వాత గనిపై ఫుల్ ఫోకస్ పెట్టాను ఈ సినిమా విషయంలో ఫిజికల్‌గా చాలా కష్టపడ్డాను. రామ్‌చరణ్‌గారు ఆయన ట్రైనర్ రాకేష్‌ను నాకు సజెస్ చేశారు. గని సినిమాలో యాక్షన్‌తో పాటు, ఎమోషన్స్ కూడా ఉంటాయి. మదర్ సెంటిమెంట్ కూడా బాగుంటుంది
– గని సినిమాలో నా క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయి. ఫస్టాఫ్‌లో గోల్‌ను సాధించాలని తాపత్రయపడే యువకుడిగా కనిపిస్తాను. కానీ సెకండాఫ్‌లో తప్పులు తెలుసుకుని మంచి గైడ్‌లైన్స్‌తో లక్ష్యాన్ని చేధించేగని పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాలో ఉపేంద్రగారిని కొత్త స్టైల్లో చూస్తారు. ఈ సినిమాతో నాకు మంచిక్రమశిక్షణ వచ్చింది.
– మల్టీస్టారర్ సినిమాలంటే నాకు ఇష్టమే. కథ నచ్చితే తప్పకుండా చేస్తాను. సాయితేజ్, నితిన్‌లతో నాకు మల్టీస్టారర్ ఫిల్మ్స్ చేయాలని ఉంది. ఇక నా సినిమాలు సరైన ఫలితాలు ఇవ్వన్నప్పుడు ఆలోచించుకుంటాను. మిస్టర్, అంతరిక్షం ఆడలేదు. దీంతో ఈ సినిమాలను విశ్లేషిం చుకున్నారు. ఆడియన్స్ ఫల్స్ను అర్ధం చేసుకోవాలనుకున్నాను.
– నా కెరీర్లో రొమాంటిక్ సినిమాలు హిట్ సాధించాయి కానీ నాకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. యాక్షన్ హీరో అవుదామనే ఇండస్ట్రీ వచ్చాను. గని మంచి యాక్షన్ ఫిల్మ్. నా తర్వాతి సినిమా ప్రవీణ్ సత్తారుగారిదర్శకత్వంలో ఉంటుంది. ఇదీ కూడా పవర్‌పుల్ యాక్షన్ ఫిల్మ్. మేలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ఇక ఎఫ్ 3సమ్మర్లో వస్తుంది. మరో రెండు సినిమాల కోసం చర్చలు జరుగుతున్నాయి. కిరణ్‌కు అడ్వాన్స్ ఇచ్చాను. అయితే ఈ సినిమాలో నేనే నటిస్తానా? లేక వేరేవారు నటిస్తారా? అన్న విషయంపై కొంతకాలం తర్వాత క్లారిటీ వస్తుంది.