HeroPawankalyan: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పనులతో జనసేన పార్టీ అధినేతగా ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే పవన్‌కళ్యాణ్ హీరోగా చేస్తున్న సినిమాల్లో ‘హరిహరవీరమల్లు’, ‘ఉస్తాద్‌భగత్‌సింగ్’
చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు కూడా రిలీజ్ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్
లో స్ట్రీమింగ్ కానున్నట్లుగా వెల్లడైంది. ముంబైలో అమెజాన్ ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ విషయాలు బయటకు వచ్చాయి. కానీ పవన్ ఫ్యాన్స్ నిరాశే ఎదురైంది.
‘హరహరవీరమల్లు’ సినిమా టీజర్‌ను గడిచిన మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేస్తామని మేకర్స్ అధికారి కంగానే ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఊసే లేదు. పవన్ ఫ్యాన్స్ ఊసురుమన్నారు. పోనీ.. అమెజాన్ వేడుకలో అయిన ‘హరిహరవీరమల్లు’ సినిమా టీజర్ వస్తుందెమో అనుకున్నారు. కానీ రాలేదు. దీంతో పవన్‌ఫ్యాన్స్ మరింత డీలా పడ్డారు.
VaruntejGhani: గని సినిమా అందుకు ఫ్లాప్.. ‘గని’ నిర్మాత సిద్దు ముద్దా
బాలకృష్ణతో ‘గౌతమీపుత్రశాతకర్ణి’ వంటి హిస్టారికల్ యాక్షన్ మూవీ తీసిన క్రిష్ ‘హరహరవీరమల్లు’ సిని
మాకు దర్శకుడు. ఈ సినిమా 2022 సంక్రాంతికి విడుదల చేస్తామని మేకర్స్ ఓ సందర్భంలో ప్రకటించారు.విశేషం ఏంటంటే…ఈ సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. పవన్‌కల్యాణ్, క్రిష్‌లకు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ అని ఫిల్మ్‌నగర్ టాక్. ముఖ్యంగా సెకండాఫ్‌లో అట. నిజానికి ఈ సినిమాలోని ఔరంగజేబు పాత్రను బాబీడియోల్ చేయాల్సింది. ప్రాజెక్ట్ ప్రొగ్రెస్ చూసి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఇమ్రాన్హష్మీని తీసుకున్నారట మేకర్స్. ఏఏమ్ రత్నం ఈ సినిమాకు నిర్మాత. నిధీ అగర్వాల్ ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తున్నారు.
‘గబ్బర్‌సింగ్’ తీసిన పుష్కరకాలం తర్వాత పవన్‌కళ్యాణ్‌తో హరీష్‌శంకర్ చేస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. తమిళ హిట్ ఫిల్మ్ విజయ్ ‘తేరీ’కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ చిత్రం రానుందని తెలిసింది. (ఈ చిత్రం తెలుగులో ‘పోలీసోడు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది). ఈ సినిమా టీజర్‌ను అమెజాన్ వేడుకలో రిలీజ్ చేశారు మేకర్స్. ఎన్నికల్లో జనసేన గుర్తు గ్లాస్‌ను ఈ వీడియో రూపంలో ప్రమోట్ చేసేందుకు ఈ సినిమా షో రీల్ బాగా ఉపయోగపడినట్లుగా ఉంది.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే… ‘ఉస్తాద్‌భగత్‌సింగ్’ కానీ, ‘హరిహరవీరమల్లు’ సినిమాను గురించిన రిలీజ్లు ఎప్పుడో స్పష్టంగా ప్రకటించలేదు. ఎందుకంటే పవన్ ప్రాజెక్ట్‌లు ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు. పైగా పవన్ హీరోగా మళ్లీ మేకప్ వేసుకుంటే వెంటనే పూర్తి చేయాల్సింది ఓజీ సినిమాను. సెప్టెంబరు 27న ఈ చిత్రంరిలీజ్ను ప్రకటించారు నిర్మాత డీవీవీ దానయ్య. సుజిత్ దర్శకుడు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా
‘ఓజీ’ సినిమా కూడా అనుకున్న తేదీకి విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.