HariharaVeeramallu Release: పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహరవీరమల్లు’ (HariharaVeeramallu Release). జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకుడు. నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. కాగా ‘హరిహరవీరమల్లు’ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేస్తామని ఆ సమయంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ చిత్రం విడుదల కాలేదు. ఆ తర్వాత 2022 ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తామన్నట్లుగా ప్రకటించారు.
Get ready for power star #PawanKalyan’s upcoming movie #HariHaraVeeraMallu which is set to release on Sankranti 2022. Releasing in #Hindi, #Telugu, #Tamil, #Kannada and #Malayalam are you in for a roller-coaster of entertainment with us? #Titleposter #Upcomingmovie #SPICinemas pic.twitter.com/fBlVW4ocI7
— S P I C i n e m a s (@SPICinemas) March 12, 2021
కానీ అప్పుడు కూడా ‘హరిహరవీరమల్లు’ సినిమా రిలీజ్‌కు నోచుకోలేదు. మరో రెండు సంవత్సరాలు గడుస్తున్న ఈ సినిమా రిలీజ్‌పై ఓ స్పష్టత రావడం లేదు. ‘హరిహర వీరమల్లు’ను స్టార్ట్ చేసిన తర్వాత పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన ఇతర సినిమాలు ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’లు కూడా విడుదల అయ్యాయి. ఓజీ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. కానీ ‘హరిహరవీరమల్లు’ సినిమా సంగతి ఆగమ్యగోచరంగా మారింది. ఈ సినిమా దర్శకుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అనుష్కాశెట్టితో ‘శీలవతి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా చేస్తున్నారు క్రిష్.అయితే మిగిలిన ‘హరిహరవీరమల్లు’ సినిమా షూటింగ్‌ను ఏఎమ్‌రత్నం కుమారుడు, దర్శక–నిర్మాత ఏఎమ్ జ్యోతికృష్ణ పూర్తి చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఓ దశలో ఈ సినిమా ఆగిపోయిందనే టాక్ వినిపించింది. కానీ ‘హరిహరవీరమల్లు’ సినిమా ఆగిపోలేదని, మార్చి 8న ఓ గ్లింప్స్ వీడియో విడుదల చేస్తామని మేకర్స్ ఓ నోట్‌ను విడుదల చేశారు. ఈ వీడియోలో ‘హరిహర వీరమల్లు’ సినిమారిలీజ్ డేట్ ఉంటుందో లేదో చూడాలి. ఇకపోతే..‘హరిహరవీరమల్లు’ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే కొత్త ప్రచారంలో ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
Pawan Kalyan: పవన్‌కళ్యాణ్‌తో సినిమా చేసే దర్శకులకు ప్లాన్ బీ ఉండాల్సిందేనా?
Pawan Kalyan OG: అత్తారింటికి దారేది సెంటిమెంట్‌తో ఓజీ?
ఇటు పవన్‌కల్యాణ్ ఏపీ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. వేసవి తర్వాత పవన్‌కల్యాణ్ ఏపీ రాజకీయాలనుంచి కాస్త ఫ్రీ అవుతారు. సుజిత్ దర్శకత్వంలోని ‘ఓజీ’ సినిమాను సెప్టెంబరు 27న రిలీజ్ ప్రకటించారు.కాబట్టి పవన్ ముందుగా ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు. ఇక పవన్‌కళ్యాణ్ ‘ఉస్తాద్‌భగత్‌సింగ్’ కమిట్మెంట్ కూడా ఉంది.పవన్‌తో గబ్బర్‌సింగ్ తీసిన హరీష్‌శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. ఇంకాసురేందర్ రెడ్డితో ఎస్ఆర్టీ రామ్‌తాళ్లూరి బ్యానర్లో పవన్‌కళ్యాణ్‌కు ఓ సినిమా కమిట్మెంట్ ఉంది. అలాగే పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్, పవన్‌కళ్యాణ్ నిర్మాణసంస్థ పీకే క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా ఉందని గతంలో ఓ సందర్భంగా వెల్లడించారు టీజీ విశ్వప్రసాద్.మరి..ఈ సినిమాల్లో ఏ సినిమాను ముందుగా పవన్ టేకప్ చేస్తారనే విషయం తెలియాలంటే మరికొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే మరి.