Tollywood Dussehra 2024: టాలీవుడ్లో పండగ సందర్భాల్లో విడుదల అయ్యే సినిమాలకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. యావరేజ్ సినిమాలు సూపర్‌హిట్ అవుతుంటాయి. ఫ్యామిలీ ఆడి యన్స్ల ప్రోత్సహం కూడా లభిస్తోంది. ఈ నేప థ్యంలో కొందరు హీరోలు దసరా పండగ సీజన్(Tollywood Dussehra 2024)గా సినిమాను విడుదల చేయా లనుకుంటున్నారు.
ఈ సారి దసరా మాములుగా ఉండబోయేలా కనిపించడం లేదు. దసరాకు విడుదలయ్యే సినిమాల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ‘దేవర’ సినిమాలోని తొలిపార్టు ‘దేవర : పార్ట్ 1’ దసరా సందర్భంగా అక్టోబరు 10న విడుదల కానుంది. ‘జనతాగ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. 2018లో దసరా సందర్భంగానే ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవిందసమేత వీరరాఘవ’ చిత్రం విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. మళ్లీ ఇప్పుడు ‘దేవర పార్టు 1’తో ఎన్టీఆర్ దసరాకు వస్తోంది. ఈ హిట్ సెంటిమెంట్ రిపీట్ కావాలని కోరుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.‘దేవర’ సినిమాను కళ్యాణ్‌రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. అనిరు«ద్ రవిచంద్రన్మ్యూజిక్ డైరెక్టర్.
హీరో నాగచైతన్య, దర్శకుడు చందూమొండేటి కాంబినేషన్లో ఇప్పటికే ‘ప్రేమమ్’, ‘సవ్యసాచి’, వంటి సినిమాలొచ్చాయి. ఇప్పుడు ‘తండేల్’ రూపొందుతోంది. సాయిపల్లవి హీరోయిన్. ‘తండేల్’ సినిమానుఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లుగా చందూ మొండేటి వెల్లడించారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే…నాగచైతన్య, చందుల కాంబినేషన్లో వచ్చిన ప్రేమమ్ చిత్రం 2016లో దసరా సంద ర్భంగానే అక్టోబరులో విడుదలైన హిట్ సాధించింది. దీంతో ఈ హిట్ దసరా సెంటిమెంట్‌ను రిపీట్ చేయాలని నాగచైతన్య, చందు మొండేటి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
‘భగవంత్‌సింగ్ కేసరి’తో గత ఏడాది దసరాకు సాలిడ్ హిట్ అందుకున్నారు బాలకృష్ణ. ఈ ఏడాది కూడా దసరాకు రావాలనే యోచనలో ఉన్నారట బాలయ్య. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. బందీపోట్ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.
యంగ్ హీరో నిఖిల్ చేస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ ఫిల్మ్ ‘స్వయంభూ’. భరత్‌కృష్ణమాచారి దర్శకుడు. సంయుక్తామీనన్ హీరోయిన్. స్వయంభూ సినిమాను ఈ ఏడాది దసరా లేదా దీపావళికి విడుదల చేసే ఆలోచనలో నిఖిల్ రీసెంట్ టైమ్స్‌లో ఓ సారి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
Shooting Non Stop for #SWAYAMBHU Coincidentally i am a HANUMAN devotee in the film too🙏🏽
Shooting some amazing sequences …. my favourite dialogue in the film #JaiShriRam
Will see u in theatres this Dusshera Diwali #Swayambhu pic.twitter.com/0UI4qkxBQZ
— Nikhil Siddhartha (@actor_Nikhil) January 16, 2024
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ డైరెక్టర్. ఈ సిని మాలో మోహన్‌బాబు, ప్రభాస్, శివరాజ్‌కుమార్ వంటి హీరోలు నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను దసరాకు విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మంచు విష్ణు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా న్యూజిలాండ్‌లో పూర్తయింది. ప్రీతిముకుందన్ ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అవుతున్నారు.
ఈ సినిమాలే కాదు..మరికొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు దసరా ఫెస్టివల్‌ను టార్గెట్‌గా సినిమాలు రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.