RamcharanRC16: రామ్‌చరణ్(Ramcharan), బుచ్చిబాబు కాంబినేషన్లో రానున్న స్పోర్ట్స్ ఫిల్మ్‌లో(RamcharanRC16) జాన్వీకపూర్ (Janhvikapoor) హీరోయిన్గా నటించ నున్నారు. ఈ విషయాన్ని జాన్వీకపూర్ తండ్రి బోనీకపూర్ ధృవీకరించారు. కాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ అన్నదమ్ముల మాదిరి డ్యూయోల్ రోల్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. గతంలో ‘నాయక్’ సినిమాలో రామ్‌చరణ్ ఇలా బ్రదర్స్‌లా డబుల్ రోల్ చేశారు. ఇకబుచ్చిబాబు సినిమాలోని ఓ కోచ్ పాత్రలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ నటిస్తారనే టాక్ వినిపిస్తోంది.తాజాగా ఈ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నట్లుగా ఆయన తండ్రి బోనీకపూర్ ఓ వీడియోలో పేర్కొన్నారు. ఉత్తరాంధ్రనేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, పార్వతీపురం, రాజాం, నీలిమర్ల, బొబ్బిలి, రాయగడ్డ లొకేషన్స్‌లో ఈ సినిమా మేజర్ పార్టు చిత్రీకరణ జరగనుంది. 2025లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
#RC16#RamCharanpic.twitter.com/lsp8DBeDwn
— TollywoodHub (@tollywoodhub8) February 18, 2024
Janhvikapoor: టాలీవుడ్..బాలీవుడ్..జాన్వీకపూర్ నామస్మరణ!
మరోవైపుఆల్రెడీ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలోని ఈ సినిమా జాన్వీకపూర్‌కు తొలి తెలుగు సినిమా. అక్టోబరు 10న ‘దేవర’ చిత్రం తొలిపార్టు విడుదల కానుంది. అలాగే అఖిల్ సినిమాలో జాన్వీ ఓ హీరోయిన్గా నటిస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది.