NTR Devara: ‘జనతాగ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘దేవర’(NTR Devara). స్టార్టింగ్ నుంచే ఈ సినిమా సవాళ్లను ఎదుర్కొంటోంది. ‘ఆచార్య’ ఎఫెక్ట్‌తో కొరటాల శివ ‘దేవర’ సినిమాను కాస్త ఆలస్యంగా ప్రారంభించారు. జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. విలన్‌గా సైఫ్అలీఖాన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరు«ద్ రవిచంద్రన్‌ను తీసుకున్నారు. ముందు ఒకే సినిమాగా అనుకున్న ‘దేవర’రెండు భాగాలైంది. తొలిభాగం ఏప్రిల్ 5న విడుదల కావాల్సింది. అక్టోబరు 10కి వాయిదా వేశారు. టీజర్తర్వాత సాంగ్‌ను రిలీజ్ ప్లాన్ చేశారు. అనిరు«ద్ బిజీగా ఉండటం వల్ల కుదర్లేదు. ఈ లోపు మళ్లీ కొరటాల శివను ‘శ్రీమంతుడు’ వివాదం చుట్టుముట్టింది. దీంతో షూటింగ్ షెడ్యూల్స్
లో మార్పులు చోటు చేసు కున్నాయి. ఇంకా ‘దేవర’ ముందు ఎన్నో సవాళ్లు కనిపిస్తున్నాయి.
Devara: గండం గట్టెక్కుతాడా దేవర?
ఎన్టీఆర్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘ఆంధ్రావాలా’. ఇందులో తండ్రీకొడుకులుగా నటిం చారు ఎన్టీఆర్. 2004లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. మళ్లీ దాదాపు ఇరవై సంవత్సరాలతర్వాత ‘దేవర’ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు ఎన్టీఆర్. అదీ కూడా తండ్రీకొడుకుల పాత్రల తోనే.
గతంలో పవన్‌కళ్యాన్ నటించిన ‘అత్తారంటికీ దారేది’, ఎన్టీఆర్ చేసిన ‘రామయ్య…వస్తావయ్యా’ సినిమాలు 10 రోజుల గ్యాప్‌లో విడుదలైయ్యాయి. ఆ సమయంలో ఎన్టీఆర్ సినిమా ప్లాఫ్గా నిలవగా, పవన్ మూవీఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇప్పుడు ఈ సీన్ మళ్లీ తెరపైకి వచ్చింది. పవన్‌కళ్యాణ్ ఓజీ సినిమా సెప్టెంబరు 27న రిలీజ్ అవుతుండగా, 15 రోజుల గ్యాప్‌లో ‘దేవర’ థియేటర్స్‌కు వస్తోంది. అయితే ..‘ఓజీ’ గ్యాంగ్స్టర్మూవీ, పైగా..ముంౖబై బేస్డ్ ఫిల్మ్. ఇది బాలీవుడ్లో ‘ఓజీ’కి క్రేజ్ వచ్చేలా చేస్తుంది. దీంతో ‘దేవర’కు బాలీవుడ్లో క్రేజ్ తగ్గే చాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు.
‘దేవర’ను అక్టోబరు 10న విడుదల చేస్తున్నట్లుగా ప్రటించారు మేకర్స్. కానీ ఇదే సమయంలో హాలీవుడ్ హిట్ ‘జోకర్’ సీక్వెల్ ‘జోకర్ 2’ విడుదల అవుతుంది. అక్టోబరు 9న ‘దేవర పార్టు 1’ ప్రీమియర్స్‌కు ‘జోకర్2’ బెడత ఉంటుంది. ఎందుకంటే 2019లో విడుదలైన ‘జోకర్’ సినిమాకు ఇండియాలో మంచి ఆదరణ లభించింది.
దేవర సినిమాలో విలన్ రోల్ చేస్తున్న సైఫ్ అలీఖాన్ ఇటీవల గాయపడ్డారు. ఆయన తిరిగి ఎప్పుడూ సెట్స్‌లో పాల్గొంటారో తెలియదు. అలాగే వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా చేయాల్సిఉంది ’దేవర’ సినిమాకు. ఇక ఈ సినిమా పరంగా బిజినెస్ కూడా కాస్త స్లోగా ఉందనే టాక్ వినిపించింది.
‘దేవర’ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇంకా ఏమీ అంతగా రాలేదు. ఓకే ఒక్క టీజర్ మాత్రమే ఉంది. అలాగే ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న అనిరు«ద్రవిచంద్రన్ చేతిలో ప్రజెంట్ 10సినిమాలు ఉన్నాయి. వీటిలో ఆరు సినిమాలు ‘దేవర’ కంటే ముందు రిలీజ్ కావాల్సినవి ఉన్నాయి. ఇలాఅనిరు«ద్ ‘దేవర’ సినిమాకు ఏ మాత్రం ఫోకస్ పెడతాడు? అనేది మరో ప్రశ్న. పైపెచ్చు…అనిరు«ద్ తెలుగులో మ్యూజిక్ ఇచ్చిన ‘గ్యాంగ్‌లీడర్’, ‘అజ్ఞాతవాసి’ వంటి సినిమాలు హిట్ సాధించలేకపోయాయి.
ఇలా దేవర ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వీటన్నింటిని దాటుకుని దేవర విజయం సాధించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.