Ooru Peru BhairavakonaReview: రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువగా ఫ్యాంటసీ హారర్ ఫిల్మ్స్‌కు తెలుగు ఆడియన్స్ మొగ్గు చూపిస్తున్నారు. ఈ కోవలో వచ్చిన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన(Ooru Peru Bhairavakona)’. ‘టైగర్’ చిత్రం తర్వాత హీరో సందీప్‌కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్లో వచ్చిన ఫిల్మ్ ఇది. ‘సామజ వరగమన’తో హిట్ కొట్టిన రాజేష్ దం డ నిర్మించారు. మరి..ఫాంటసీ ఎలిమెంట్స్‌తో ‘ఊరి పేరు భైరవకోన’ చిత్రం ఆడియన్స్‌ను మెప్పిం చిందా? రివ్యూలో చదివేద్దాం..
సినిమా: ఊరి పేరు భైరవకోన (Ooru Peru Bhairavakona)
ప్రధాన తారాగణం: సందీప్‌కిషన్, వర్షాబొల్లమ్మ, కావ్యాథాపర్, రవిశంకర్, వెన్నెల కిశోర్, హర్ష
దర్శకుడు: వీఐ ఆనంద్
నిర్మాత: రాజేష్ దండా
సంగీతం: శేఖర్ చంద్ర
కథ
సినిమాలో స్టంట్ కొరియోగ్రాఫర్ బసవలింగం (సందీప్‌కిషన్). కిరాయి హంతుకులతో బసవలింగంకు కనెక్షన్స్ ఉంటాయి. ఓ పనిమీద హైదరాబాద్‌కు వచ్చిన పచ్చ గూడెం ట్రైబల్ అమ్మాయి భూమి (వర్ష బొల్లమ్మ)ని ఇష్టపడతాడు. ప్రేమిస్తాడు. కానీ ఇంతలో సందీప్కారణంగా భూమి చనిపోతుంది. దీంతో ఆ పచ్చగూడెం ప్రజలకు, భూమి ఆశ నెరవేర్చడం కోసం బసవలింగం ఓ పెద్ద దొంగతనం చేస్తాడు.పారిపోయే క్రమంలో హైవే దొంగ గీతా(కావ్యాథాపర్) బసవ లింగంకు తారసపడుతుంది. ఈ క్రమంలో రాత్రివేళ మాత్రమే ఉండే భైరవకోనకు బసవలింగం, గీతా, జాన్(హర్ష) వెళ్తాడు. భూమి ఆశయం ఏమిటి? పచ్చగూడెం ప్రజల ప్లాబమ్స్ను బసవలింగం ఏ విధంగా సాల్వ్ చేయాలనుకున్నాడు? భైరవకోనకు బసవలింగం ఉన్న సంబంధం ఏమిటి? అనేది సినిమా కథనం
విశ్లేషణ
హీరో ప్రేమించిన అమ్మాయి చనిపోవడం, హీరో మారిపోయి తన ప్రేయసి లక్ష్యాన్ని నెరవేర్చడం అనేది పాతకాలపు కథ. ఈ స్టోరీలైన్‌కు భైరవకోన అనే ఊరిని, గురుడపురాణం అనే మైథలజీ ఎలిమెంట్స్నుజోడించి కథ చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు వీఐ ఆనంద్. కానీ బసవలింగం దొంగతనం చేసి పారిపోయే ఎపిసోడ్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత భూమితో అతను ఎలా ప్రేమలో పడ్డాడు?భూమి లక్ష్యం ఏమిటి? భైరవకోన గురించి హీరో తెలుసుకున్న నిజాలు ఏమిటి? అనే అంశాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది.
భైరవకోన నుంచి ప్రాణాలతో బయటపడ్డ బసవలింగం మళ్లీ అక్కడికి వెళ్లడం, రాజప్ప కూతురిగా కావ్యాథాపర్ యాక్ట్ చేయడం, భూమి తిరిగి భైరవకోనలో ప్రత్యక్షం కావడం అనే సన్నిశాలతో సినిమా ముగుస్తుంది. స్టోరీ లైన్ చిన్నదైనప్పుడు దాని చుట్టు స్ట్రాంగ్ ఎమోషన్ అల్లుకోవాలి. అదీఈ సినిమాలో అంతగా కనిపించదు. గరుడపురాణం కాన్సెప్ట్ కూడా స్టోరీకి మంచిగా ఆపాదించలేకపోయాడు దర్శకుడు. హారర్ ఎలిమెంట్స్ కూడా రోటీన్‌గా ఉంటాయి. పచ్చగూడెం ప్రజలకే సరైన గుర్తింపులేనప్పుడు…ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం చనిపోయిన పచ్చగూడెం దొర డీఎన్ఏ అనవాళ్లతో ప్రభుత్వాన్ని నమ్మించాలనుకోవడం కాస్త వాస్తవానికి దూరంగా ఉంటుంది. అలాగే కొంతమంది పచ్చగూడెంనే ఎందుకు టార్గెట్ చేస్తారు? అనేది క్లారిటీ ఉండదు. సినిమాలో ప్రభుత్వ అధికారులు తమకు50 లక్షలకు పైగా చాలు అన్నట్లుగా అంటే…హీరో ఎమో ఒక్కోక్కరికి కోటి ఇస్తానని, మొత్తం నాలుగు కోట్లు ఇస్తాననడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. కానీ అక్కడక్కడ వచ్చే వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్ బాగుంటుంది. శేఖర్‌చంద్ర మ్యూజిక్ బాగుంటుంది. ఆర్ఆర్ సినిమాను నిలబెట్టింది. రాజ్‌తోట సినిమాటోగ్రఫీ ఒకే. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ గందరగోళంగా అనిపిస్తుంది.
పెర్ఫార్మెన్స్
సందీప్‌కిషన్ కష్టం కనిపిస్తోంది. కానీ పెర్ఫార్మెన్స్ మాత్రం రోటీన్‌గానే ఉంది. ఎమోషన్ సీన్స్‌లోనూ అరవడమే కానీ..ఆ హావభావాలు ఆడియన్స్‌కు కనెక్ట్ కావు. వర్ష బొల్లమ్మకు మంచి పాత్ర లభించింది.సెకాండాఫ్‌లో వర్ష చేసే ఓ చిన్నపాటి యాక్షన్ హై ఇస్తుంది. కావ్యాథాపర్ పాత్ర గీత రోటీన్‌గానే ఉంటుంది. యాక్టింగ్‌కు స్కోప్ లేదు. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్‌లో కావ్యాథాపర్ అసలు కనిపించదు. కథనుకాస్త ముందుకు నడిపిన కావ్యాథాపర్ పాత్ర సడన్గామాయం కావడం ఆడియన్స్‌కు నప్పదు. ఒకవైవా హర్ష పాత్ర జాన్‌గా ఫర్వాలేదు. ఇక భైరవకోన డాక్టర్ నారప్పగా వెన్నెల కిశోర్ పాత్ర బాగుంటుంది. హర్ష, వెన్నెల కిశోర్‌ల మధ్య వచ్చే సంభాషణలు ఆడియన్స్‌ను నవ్విస్తాయి. రాజప్పగా రవిశంకర్ బాగా చేశారు. కాస్త ఎమోషన్ చూపించారు ఆ పాత్రలో. పెద్దమ్మ పాత్రలో వడివుక్కవాసి ఫర్వాలేదు. రాజేష్
దండా నిర్మాణ విలువలు ఫర్వాలేదు. వీఎఫ్ఎక్స్ ఒకే.
బలాలు
సందీప్‌కిషన్, వర్ష బొల్లమ్మల యాక్టింగ్
మ్యూజిక్, ఆర్ఆర్
కామెడీ సంభాషణలు
బలహీనతలు
రోటీన్ స్టోరీలైన్హారర్ ఎలిమెంట్స్