DevaraSongs: ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. రెండు పార్టులుగా విడుదల కానున్న ఈ సినిమా తొలిపార్టు ఈ ఏడాది అక్టోబరు 10న (DevaraSongs)ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ పనులను వేగవంతం చేశారు చిత్రంయూనిట్. ‘దేవర’ సినిమా మొదట్నుంచి కూడాను ఎక్కువగా మేజర్‌గా యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ జరిగింది. మేజర్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ పూర్తయింది. దీంతో ఎన్టీఆర్, జాన్వీల మధ్య ఉన్న సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్లపై చిత్రంయూనిట్ ఫోకస్ పెట్టిందని సమాచారం. ఓ సాంగ్‌ను గోవాలో మరో పాటను కేరళోని కొచ్చిలో ప్లాన్ చేశారట మేకర్స్. ముందుగా మార్చి రెండోవారంలో కేరళ వెళ్తారట చిత్రంయూనిట్. అలాగే దసరాకు ఈ సినిమా విడుదల అవుతుంది కాబట్టి సినిమాలో ఆయుధపూజ నేపథ్యంలో సాగే ఓ పాటను అనుకుంటున్నారట. ‘దేవర’ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్త.
కళ్యాణ్‌రామ్, మిక్కిలినేని సుధాకర్. కె. హరికృష్ణ ‘దేవర’ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. విడులైన పోస్టర్స్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక దేవర సినిమా కాకుండా ఎన్టీఆర్‌కు ప్రశాంత్‌నీల్‌తో ఓ సినిమా, అయాన్ముఖర్జీతో ఓ సినిమా చేయాల్సిన కమిట్మెంట్స్ ఉన్న సంగతి తెలిసిందే.