Devara: అందరూ ఊహించినట్లుగానే ‘దేవర’ సినిమా తొలిపార్టు విడుదల ఏప్రిల్ 5న విడుదల కావడం లేదు. ‘దేవర’ (Devara) సినిమా రిలీజ్ వాయిదా పడింది. ‘జనతాగ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. కళ్యాణ్‌రామ్, కె. హరి కృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాతో జాన్వీకపూర్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కానుంది. సైఫ్ అలీఖాన్, ‘దసరా’విలన్ షైన్ టామ్ విలన్ రోల్స్ చేస్తు న్నారు. రెండు పార్టులుగా ‘దేవర’ సినిమాను విడుదల చేయనున్నట్లుగా ఈ చిత్రం దర్శకుడుకొరటాల శివ ప్రకటించారు.
Devara: దేవర రిలీజ్‌పై గందరగోళం…వాయిదా పడుతుందా?
ఇక ‘దేవర’ సినిమా విడుదల వాయిదా పడటానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ము ఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కీలకమైన ఆంధ్రప్రదేశ్ మార్కెట్ కీలకం. అయితే ఈ ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగున్నాయి. అలాగే ‘దేవర’ సినిమాకు చాలా వీఎఫ్ఎక్స్ వర్క్ చేయాల్సింది. ఏప్రిల్ 5న విడుదల అంటే వీఎఫ్ఎక్స్ వర్క్‌ను క్వాలిటీగా చేయడంకుదరదు. పైగా ‘ఆచార్య’ వంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ తీస్తున్న ఫిల్మ్ ఇది. కాబట్టి క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీలేకుండా చేయాలన్నది కొరటాల తీసుకున్న గట్టి నిర్ణయంఅట. అలాగే ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ అనిరు«ద్ రవించంద్రన్ మల్టీఫుల్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇదొక ముఖ్య కారణం. సైఫ్అలీఖాన్ కాలికి శ్రస్తచికిత్స జరిగింది. దీంతో కొన్ని రోజులు సైఫ్ షూటింగ్లో పాల్గొనే అవకాశం లేదు. దేవర వాయిదాకు ఇది మరొక కారణం. భారీ బడ్జెట్‌తో ‘దేవర’ సినిమాను తీస్తున్నారు. కానీ చిత్రం నిర్మాతలు ఆశించిన బిజినెస్ ఈ సినిమాకు జరగడం లేదన్న గ్యాసిప్స్
కూడ ఉన్నాయి. కాగా ‘దేవర’ సినిమా విడుదల ఈ ఏడాదిలోనే ఉండొచ్చని, ఆగస్టు 15న విడుదల కావొచ్చనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.