AlluArjun Pushpa3: ‘పుష్ప’ ఫ్రాంచైజీలో ‘పుష్ప 3’(Pushpa3) సినిమా ఉంటుందనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా ఈ చిత్రం హీరో అల్లు అర్జున్ (AlluArjun) వెల్లడించారు. జర్మనీలో జరుగుతున్న 74వ బెర్లిన్ఫిల్మ్ఫెస్టివల్(74th annual Berlin International Film Festival)లో పాల్గొన్నారు అల్లు అర్జున్. అక్కడ ‘పుష్ప 3’ సినిమాను గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘పుష్ప’ సినిమాను ఓ ఫ్రాంచైజీలా చేసే ఆలోచనలో ఉన్నాం. మల్టీయూనీవర్స్లా చేసే ప్లాన్ కూడా ఉంది. మీరు తప్పకుండ ‘పుష్ప 3’ సినిమాను ఎక్స్పెక్ట్ చేయవచ్చు’’ అంటూ మాట్లాడారుఅల్లు అర్జున్. దీంతో ‘పుష్ప 3’ సినిమా ఉంటుందని పరోక్షంగా కన్ఫార్మ్ చేశారు అల్లు అర్జున్. ప్రస్తుతం ‘పుష్ప’ ఫ్రాంచైజీలోని రెండో భాగం ‘పుష్ప :ది రూల్’తో బిజీగా ఉన్నారు హీరో అల్లు అర్జున్, దర్శకుడుసుకుమార్. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.
ఇంకా పుష్ప ది రూల్ సినిమాను గురించి మరికొన్ని వివరాలను వెల్లడించారు అల్లు అర్జున్. ‘పుష్ప: ది రూల్’ సినిమాలోని హీరో క్యారెక్టరైజేషన్ చాలా పెద్ద స్కేల్లో ఉంటుంది. పుష్పరాజ్( ఈ సినిమాలో అల్లుఅర్జున్ పాత్ర), భన్వర్‌సింగ్ షెకావత్ (సినిమాలో ఫాహద్‌ఫాజిల్ పాత్ర)మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ టఫ్‌గా ఉంటుంది. అంతే కాదు. .కథలో ఇంటర్నేషనల్ టచ్ ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. అలాగేతన తర్వాతి సినిమాలు కూడా మంచి లైనప్‌లో ఉన్నాయని చెప్పారు అల్లు అర్జున్. ఇక ‘పుష్ప: ది రైజ్’ సినిమా పదర్శన నిమిత్తం అల్లు అర్జున్ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరవుతున్న సంగతి తెలిసిందే.
SSRajamouli: చెట్టు ఆధారంగా సినిమా..పాకిస్తాన్లో దొరకని అనుమతులు