Maheshbabu MahaRaja: మహేశ్‌బాబు (Maheshbabu), రాజమౌళి కాంబినేషన్లోని క్రేజ్‌ను గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగు సినిమాయే కాదు..యావత్తు సినీ ప్రపంచం ఈ సినిమా అప్డేట్స్ను గురించి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తాజాగాఈ సినిమాను గురించిన మరో అప్డేట్ తెరపైకి వచ్చింది. మహేశ్‌బాబు కెరీర్లో 29వ సినిమా ఇది. అయితే ఈ సినిమాకు ‘మహారాజా’, ‘మహారాజ్’, ‘చక్రవర్తి’ అనే టైటిల్స్‌ను అనుకుంటున్నట్లుగా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఫారెస్ట్ అడ్వెంచరస్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమాకథ ఓ నిధి అన్వేషణగా సాగుతుందట. గతంలో మహేశ్‌బాబుతో మీరు ఎలాంటి సినిమా చేస్తారు?అని రాజమౌళిని అడిగినప్పుడు…‘మహేశ్‌బాబును కౌ బాయ్‌గా చూడాలని ఉంది. నా డైరెక్షన్లో మహేశ్‌బాబు సినిమా అంటే..ఈ తరహాలోనే ఉంటుందన్నట్లుగా చెప్పుకొచ్చారు రాజమౌళి. సో…ఇప్పుడుఆ పని చేస్తున్నారన్నమాట.
అంతా బాగానే ఉంది కానీ….విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న50వ సినిమా ‘మహారాజా’(Maharaja). షూటింగ్‌కు జరుగుతోంది. ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. ఈ తరుణంలో మహేశ్–రాజమౌళి కాంబినేషన్లోని భారీ సినిమాకు ఇలాంటి ఓ టైటిల్ తెరపైకి రావడం ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. విజయ్‌సేతుపతికి మహేశ్‌బాబు ఓ చిన్నపాటి షాక్ ఇచ్చినట్లు అయ్యింది. ఇక విజయ్‌సేతుపతి 50వ సినిమా అయిన ‘మహారాజా’కు నితిలాన్ స్వామినాథన్ డైరెక్టర్. మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలు పోషిస్తున్నారీ సినిమాలో.
Tollywood Artist: ప్లీజ్…ఒకే ఒక్క చాన్స్!
Tollywood Debut heroines 2024: తెలుగులో ఈ ఏడాది పరిచయం అవుతున్న హీరోయిన్స్ సంఖ్య పెద్దదే