Mrunal Thakur: ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైయ్యారు హీరోయిన్ మృణాల్‌ఠాకూర్ (Mrunal Thakur) ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ‘ఫ్యామిలీస్టార్’లో హీరోయిన్గా చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇక తమిళంలో ఇటీవలే ఓ తమిళ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు మృణాల్ ఠాకూర్. కానీ లాస్ట్ మినిట్ ఈ ప్రాజెక్ట్ నుంచి మృణాల్ తప్పుకోవాల్సివచ్చింది. ఈ చిత్రం దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చివరి నిమిషంలో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత (Rukmini Vasanth)నుతీసుకున్నారు. దీంతో చేతిదాక వచ్చిన అవకాశం చేజారింది మృణాల్‌కు. అదీ కాక…మృణాల్ పరోక్షంగాఒప్పుకున్న తొలి తమిళ సినిమా ఇది. కోలీవుడ్‌లో తొలి సినిమాకే ఇలా జరగడం మృళాల్ను కాస్త బాధపెట్టిందట. ఆమె ఫ్యాన్స్ కూడా అయ్యె…పాపం..మృణాళ్‌కు ఇలా జరిగిందా? అంటూ బాధపడుతున్నారు.
‘‘ఈ సినిమాకు తొలుత మృణాల్ఠాకూర్ను అనుకున్నాం. కానీ ఈ సినిమాలోని క్యారెక్టరైజేషన్‌కు రుక్మిణీ వసంత మరింత దగ్గరగా ఉంటుందని ఆమెను ఫైనలైజ్ చేశాం. శివకార్తీకేయన్ కెరీర్లో ఈ చిత్రం స్టైలిష్గాఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు దర్శకుడు ఏఆర్ మురగదాస్. ఒక దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత అంటే…రజనీకాంత్ ‘దర్బార్’ తర్వాత ఏఆర్ మురగదాస్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.