‘AR Murugadoss: రమణ’ (తెలుగులో చిరంజీవి ‘ఠాగూర్’గా రీమేక్ చేశారు), ‘గజిని’, ‘తుఫాకీ’, ‘కత్తి’,…బ్లాక్‌బస్టర్ ఫిల్మ్స్. ఈ సినిమాలకు దర్శకుడు ఏఆర్ మురుగదాస్. కానీ 2015 నుంచి మురగదాస్ కాస్త స్లో అయ్యారు. ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకుని మహేశ్‌బాబుతో మురగదాస్ తీసిన ‘స్పైడర్’, విజయ్‌తో చేసిన ‘సర్కార్’ విఫలమయ్యాయి. మరీ..ముఖ్యంగా రజనీకాంత్‌తో మురగదాస్ తీసిన ‘దర్భార్’ ఓ పెద్ద ఫ్లాప్ మూవీగాపేరు తెచ్చుకుంది. దీంతో మురగదాస్ ఒక్కసారిగా డీలా పడ్డారు. నాలుగు సంవత్సరాలు అవుతోంది. కానీమెగాఫోన్ పట్టింది లేదు. మధ్యలో సల్మాన్‌ఖాన్, అల్లు అర్జున్ అంటూ వార్తలు వచ్చాయి కానీ ప్రాజెక్ట్ అయితే సెట్ కాలేదు.
ఫైనల్‌గా శివకార్తీకేయన్‌తో సినిమాకు ఓకే చేయించారు మురుగదాస్. ఈ సినిమా(SK23) పూజా కార్యక్రమం కూడా జరిగింది. కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత మెగాఫోన్ పట్టిన మురగదాస్ ఎలాగైనా సరే హిట్ కొట్టాలని, పాత ఫామ్‌ను పునికిపుచ్చుకోవాలని ట్రై చేస్తున్నారు. మరి..ఏం జరుగుతుందో చూడాలి.