Tollywood Artist: ఇండస్ట్రీలో అద్భుతాలు చాలా జరిగాయి. జరుగుతూనే ఉంటాయి. హీరోలు విలన్లు అయ్యారు. విలన్లు హీరోలైయ్యారు. దర్శకులు నిర్మాతలైయ్యారు. నిర్మాతలు దర్శకురాలైయ్యారు. కొందరు హీరోలు నిర్మాతలైయ్యారు. మరికొందరు దర్శకులైయ్యారు. ఇప్పుడు హీరోగా ఒకే ఒక్క చాన్స్ అంటూ కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోగా సినిమాలు చేస్తున్నారు. హీరోగా హిట్ అయితే..ఓటీటీ కోటాలో అయిన పెట్టిన బడ్జెట్రికవరీ అయితే…వీరందరూ పార్ట్‌టైమ్ హీరోలైపోవచ్చు.
హాస్యనటుడిగా ‘వెన్నెల’ కిశోర్(Vennela kishore) వేసిన బోలేడువేషాలు ఆడియన్స్‌ను బాగా నవ్వించాయి. ఇప్పుడు ‘వెన్నెల’ కిశోర్ సడన్‌గా హీరో అయ్యారు. ‘ఛారి 116’ అనే ఓ స్పై ఫిల్మ్ చేస్తున్నారు మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది.రావురమేష్(RaoRamesh)ది ఇదే దారి. ఇన్ని రోజులు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసిన ఆయన ‘మారుతీనగర్ సుబ్రహ్మాణ్యం’ అనే సినిమా చేస్తున్నారు. ఇంద్రజ హీరోయిన్. ఈ సినిమా హిట్ అయితే రావురమేష్ ఈ తరహా చిత్రాలను మరిన్ని చేస్తారనుకోవచ్చు. అజయ్ఘోష్ది(AjayGhosh) సేమ్ ట్రాక్. ఆయన టైటిల్ రోల్లో ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమా చేస్తున్నారు. ‘కలర్‌ఫోటో’ ఫేమ్ చాందినీ చౌదరి హీరోయిన్. హాస్య నటుడు వైవా హర్ష లీడ్ రోల్లో‘సుందరం మాస్టారు’ సినిమా చేశారు. హీరోగా ఆయనకు ఇదే తొలి సినిమా అని తెలుస్తోంది. మరో హాస్య నటుడు వేణు దర్శకుడిగా తొలి చిత్రం ‘బలగం’ సినిమా తీసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. నెక్ట్స్ సినిమాను నానితో తీసేందుకు రెడీ అవుతున్నారు. ఇలా మరికొంతమంది వారి రోటీన్ జాబ్‌లను పక్కన పెట్టి కొత్తగా ప్రయత్నించడానికి సిద్ధమైయ్యారు. కొత్తగా ఒకే ఒక్క చాన్స్ ..ప్లీజ్ అంటూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.