MadmeTussauds AlluArjun: మ్యాడ్మే తుస్సాడ్స్ మ్యూజియంతో అల్లు అర్జున్ మైనపు విగ్రహం ప్రదర్శనకు అంతా సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రీటీల విగ్రహాలను మ్యాడ్మే తుస్సాడ్స్ నిర్వాహకులు ప్రదర్శిస్తుంటారు వారి మ్యూజియంలలో. వీరికి బ్రాంచ్‌లు కూడా ఉన్నాయి. సింగపూర్, దుబాయ్ ఇలా ఉన్నాయి. సింగపూర్ కార్యా లయంలో శ్రీదేవి, మహేశ్‌బాబుల మైనపు విగ్రహాలు ఉన్నాయి. మేడమ్ తుస్సాడ్స్ రెడీ తొలి సౌత్ హీరో విగ్రహం ప్రభాస్ది. ఈ విగ్రహాం బ్యాకాంక్‌లో ఉంది.
ఇప్పుడు అల్లు అర్జున్ విగ్రహాం దుబాయ్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో 2024 మార్చి 28న ఆవిష్కరణ కానుంది (MadmeTussauds AlluArjun). ఈ విగ్రహానికి సంబంధించి అల్లు అర్జున్ ఆల్రెడీ కొలతలు ఇచ్చారు గత అక్టోబరులో. దుబాయ్‌లో ఈ నెల 28న జరిగే ఈ గ్రాండ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ హాజరవుతారు.
ప్రస్తుతం ‘పుష్ప’ ఫ్రాంచైజీలోని మలిపార్టు ‘పుష్ప: ది రూల్’తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్‌లోని ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల చేస్తామని గతంలో చిత్రంయూనిట్ ప్రకటించింది. కానీ ఈ చిత్రం విడుదలలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ టీమ్ మాత్రం ఇదే రోజున విడుదల చేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు ఈ సినిమాను.
ఈ సినిమా కాకుండా త్రివిక్రమ్, సందీప్రెడ్డివంగాలతో అధికారికంగా సినిమాలను కమిటైయ్యారు అల్లు అర్జున్. కాకపోతనే తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ నెక్ట్స్ ఫిల్మ్ సెట్స్‌పైకి వెళ్తుందనే టాక్ వినిపి స్తోంది.