ఎంటర్టైన్మెంట్ వరల్డ్‌లో సూపర్‌హీరోగా శక్తిమాన్ పాపులర్. శక్తిమాన్ ఆధారంగానే కొన్ని సినిమా లొచ్చాయి. బాలీవుడ్లో సూపర్‌హీరో శక్తిమాన్ సినిమాను చేయాల్సిన బడా నిర్మాణసంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్స్ సంకల్పించింది.ఈ ప్రాజెక్ట్ ప్రకటన రాగానే శక్తిమాన్‌గా పలువురు బాలీవుడ్ స్టార్స్ పేర్లు వినిపించాయి. కానీ రణ్‌వీర్‌సింగ్ టాప్ ప్లేస్ ఉన్నాడు.
ఈ విషయం గురించే బాలీవుడ్‌కు చెందిన ఓ యూట్యూబ్ చానెల్ ఓ వీడియోను షేర్ చేసంది. శక్తిమాన్గారణ్వీర్సింగ్ ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అన్నది ఈ వార్త సారాంశం. దీంతో ఈ వార్తను తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్చేసి, శక్తిమాన్‌గా రణ్‌వీర్‌సింగ్ ఏ మాత్రం పనికిరాడని, ఈ పాత్రకు అతను కరెక్ట్ కాదని ముకేష్ ఖన్నా పోస్ట్‌చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ముకేష్ ఎవరంటే..బాలీవుడ్ బుల్లితెరపై వీక్షకులను బాగా ఎంటర్టైన్ చేసిన శక్తిమా¯Œ అన్నమాట. బుల్లితెరపై శక్తిమాన్‌గా అలరించిన ముఖేష్ రణ్‌వీర్‌సింగ్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది బాలీవుడ్లో.
పోస్ట్‌ను డిలీట్ చేసిన ముకేష్ ఖన్నా
ఏ యూట్యూబ్ చానెల్ వీడియోను అయితే ముకేష్ షేర్ చేసి, శక్తిమాన్‌గా రణ్‌వీర్‌సింగ్ సరికాదని చెప్పిన ముకేష్..ఆ తర్వాత ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. ఎందుకంటే…ఏ యూట్యూబ్ చానెల్ వీడియోను అయితే
ముకేష్ షేర్ చేశారో, ఆ చానెల్ వారు శక్తిమాన్‌గా రణ్‌వీర్‌సింగ్ ఇంకా కన్ఫార్మ్ కాలేదని, నటీనటులు ఇంకా
కన్ఫార్మ్ కాలేదని మరో పోస్ట్ చేశారు. దీంతో ముకేష్ ఖన్నా తన పోస్ట్‌ను డిలీట్ చేయాల్సి వచ్చింది.