ఇంతటితో అనుపమాపరమేశ్వరన్ జోరు ఆగలేదు. ‘సినిమాబండి’ వంటి ఓ ఓటీటీ ప్రాజెక్ట్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ప్రవీణ్‌తో ఓ రోడ్ ట్రావెల్ ఫిల్మ్ చేస్తున్నారు అనుపమ. ఈ చిత్రంలో అనుపమ, సంగీత, మలయాళ నటి దర్శన లీడ్ రోల్స్‌లో కనిపిస్తారు. ఇటీవల తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్‌తో ఓ సినిమా కమిటైయ్యారు అనుపమాపరమేశ్వర్. ఇందులో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ హీరోగా కాగా, తమిళ దర్శకుడు పా. రంజిత్ ప్రొడ్యూసర్.
ఈ సినిమాలన్నీ ఉండగానే అనుపమ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ‘హనుమాన్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లోని నెక్ట్స్ ఫిల్మ్ ‘అక్టోపస్’లో అనుపమా పరమేశ్వరన్ ఓ లీడ్ రోల్ చేస్తున్నట్లుగా తెలిసింది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ సగానికిపైగా పూర్తయింది. ఈ ఏడాదే విడుదల చేయా లనుకుంటున్నారు. మలయాళంలోనూ అనుపమ ఓ సినిమాకు కమిటైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలా ప్రస్తుతం అనుపమాపరమేశ్వరన్ కెరీర్ అన్‌స్టాపబుల్‌గా సాగుతోంది.