DhruvSarja : విమాన ప్రయాణాలు నటీనటులను హడలెత్తిస్తున్నాయి. నిన్న…మొన్నటివరకు విమాన ప్రయాణాలు, ఎయిర్‌పోర్ట్స్‌లో అసౌకర్యాలను గురించి మాత్రమే ప్రస్తావించేవారు కొందరు నటీనటులు. అయితే ఇప్పుడు కొందరు నటీనటులు విమానయానంలో తమ ప్రాణ రక్షణను గురించి ఆందోళన చెందినట్లుగా పోస్టులు, వీడియోలు షేర్ చేస్తున్నారు.
Please check your aircrafts @airvistara if there are technical failures happening more than once..
We almost died yesterday and words are insufficient to explain that,but the pilot was just too good to have taken the right decision for an emergency landing at the right time !
— Shraddha das (@shraddhadas43) February 18, 2024
మూడు రోజుల క్రితం హీరోయిన్స్ రష్మికామందన్నా(Rashmika Mandanna), శ్రద్ధాదాస్‌లు(Shraddha Das) ముంబై నుంచి హైదరాబాద్ బయలు దేరారు. అయితే ఈ విమాన ప్రయాణంలో సాంకేతిక లోపాలు బయటపడటంతో, ప్రయాణికులు ఆందోళనకు గురైర్యారు. తమ ప్రాణాలు పోయినంత పనైయిందని రష్మికా మందన్నా ఓ ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు.
ఈ ఆందోళనకర ఘటనను మరువముందే మరోటి ఇలాంటి ఘటన జరిగింది. «కన్నడ స్టార్ హీరో ధృవసర్జా, అతనితో పాటు ఓ విమానంలో ప్రయాణం చేస్తున్న ‘మార్టిన్’ సినిమా యూనిట్ ఓ ఇబ్బందికర పరిస్థుతుల నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పైలైట్ అప్రమత్తంగా వ్యవహరించి సరైన నిర్ణయం తీసుకునివిమానాన్ని ల్యాండింగ్ చేయడం వల్లే తామకు క్షేమంగా బయటపడ్డామని ధృవసర్జా ఓ నోట్‌ను విడుదల చేశారు.
#MartinTeampic.twitter.com/8KrtlD5TOa
— TollywoodHub (@tollywoodhub8) February 19, 2024
ధృవ సర్జా అంటే యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు అన్న సంగతి తెలిసిందే. అలాగే ధృవసర్జా తమ్ముడు చిరంజీవి సర్జా 2020లో హఠాత్తుగా హార్ట్ఎటాక్తో మరణించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిరంజీవి సర్జా సతీమణి మేఘనారాజ్ హీరోయిన్ అన్న సంగతి విదితమే.
TollywoodHeroines: అనుష్కాశెట్టి…కీర్తీసురేష్..అన్యాయంపై పోరాటం!
ఇక కన్నడలో రూపొందుతున్న మరో యాక్షన్ మూవీ ‘మార్టిన్’. ధృవసర్జా హీరోగా నటిçస్తున్న ఈ సినిమాకు ఏపీ అర్జున్ డైరెక్టర్. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాకు కథ అందించారు. ఈ చిత్రంలో ధృవసర్జా డ్యూయో ల్ రోల్లో కనిపిస్తారు. దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ‘మార్టిన్’ సినిమా షూటింగ్ కోసం ఓ లొకేషన్‌కు వెళ్లి వస్తుండగా, ఈ ఆందోళనకర సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.
Tollywood Dussehra 2024: టార్గెట్ దసరా…సెంటిమెంట్ బోనస్!