Nagachaitanya Thandel: తండేల్ కోసం జైలుకు వెళ్లారు నాగచైతన్య. ‘లవ్‌స్టోరీ’ తర్వాత హీరో నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’ (Nagachaitanya Thandel). నాగచైతన్యతో ‘ప్రేమమ్’, ‘సవ్యసాచి’ సినిమాలను తీసిన చందూమొండేటి ఈ సినిమాకు దర్శకుడు. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ జైల్ సెట్‌ను ఏర్పాటు చేసి, అందులో చిత్రీకరిస్తున్నారు సినిమాను. నాగ చైతన్య జైల్లో ఉన్న సన్నివేశాలను చిత్రీకరి స్తున్నట్లుగా తెలిసింది. దసరా సందర్భంగా తండేల్ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
Ramcharan: రామ్‌చరణ్‌ను ఇబ్బందిపెట్టిన షారుక్‌ఖాన్
వాస్తవ సంఘటనల ఆధారంగా..
తండేల్ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. 2018 జీవనోపాధి కోసం గుజరాత్ తీరప్రాంతానికి వెళ్లారు ఉత్తరాంధ్ర మత్స్యకారులు. చేపల వేటలో భాగంగా వారికి తెలియకుండానే వీరు పాకిస్తాన్ జల భూభాగంలోకి ప్రవేశిస్తారు. దీంతో పాకిస్తాన్ కోస్ట్ గార్డులు వీరిని బంధీలుగా చేశారు. దాదాపు ఏడాదిన్నర వీరు జైలులోనే నరకయాతన అనుభవించారు. ఈ ఘటనల ఆధారంగానే ఈ సినిమా తీస్తున్నారు.
Tollywood Dussehra 2024: టార్గెట్ దసరా…సెంటిమెంట్ బోనస్!
వీరిలో వివాహం చేసుకోని ఏడాది మాత్రమే పూర్తవుతుంది. ఆ వ్యక్తి పాకిస్తాన్లో బందీ. మరోవైపు అతని భార్య గర్భవతి. అలాంటి పరిస్థితుల్లో నాయకుడిగా తన సహచరులను ఆ వ్యకి ఎలా కాపాడుకుంటాడు? భర్య గురించి ఆలోచిస్తూ ఎంత మదనపడ్డాడు? అనే అంశాలను భావోద్వేంగా ‘తండేల్’ సినిమాలో చూపించనున్నారు. ఆ వ్యక్తి పాత్రలోనే నాగచైతన్య నటిస్తున్నారు. ఇందులో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్యపాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు.
TollywoodHero: బాలీవుడ్ డెబ్యూ..అట్టర్ ఫ్లాప్!
తండేల్ అంటే….
గుజరాత్లో పడవ నడివే ఓ సమూహపు నాయకుడిని ‘తండేల్’ అని పిలుస్తారట. కథలో కీలకమైన భాగం, ఇంట్రెవల్ గుజరాత్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. అందుకే ఈ సినిమాకు ‘తండేల్’ అనే పేరు పెట్టారు మేకర్స్.
తర్వాతి సినిమాలు!
తండేల్ సినిమా తర్వాత నాగచైతన్య కు మంచి లైనప్ ఉంది. తనకు ‘మజిలీ’ వంటి హిట్ ఇచ్చిన శివ నిర్వాణతో నాగచైతన్య మరో సినిమా చేస్తారు. విజయ్కనకమేడల దర్శకత్వంలో కూడా నాగచైతన్య ఓ సినిమా చేయాల్సి ఉంది. కథ విన్నారు కానీ ఫైనలైజ్ కాలేదు.