Ramcharan: బాలీవుడ్ ఖాన్ త్రయం సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్, ఆమీర్ఖాన్లతో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ‘నాటు నాటు’ పాటలకు స్టెప్పులేశారు రామ్‌చరణ్ (Ramcharan). గుజరాత్లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు ఇందుకు వేదికైంది. ఈ ఫోటోలు బయటకు రాగానే టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడాలు లేకుండా సినీ లవర్స్ హ్యాపీ ఫీలయ్యారు. కానీ హ్యాపీనెస్ కొన్ని గంటలకే పరిమితం అయ్యింది.
బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ ఈ సెలబ్రేషన్స్‌లో రామ్‌చరణ్‌ను ఇబ్బందిపడేలా మాట్లాడారనే వార్తలు వస్తున్నాయి. రామ్‌చరణ్‌ను ఇంట్రడ్యూస్ చేసేప్పుడు ‘ ఇడ్లీ సాంబరు వడ’ అంటూ మాట్లాడారట షారుక్‌ఖాన్. దీంతో రామ్‌చరణ్ కాస్త ఇబ్బందిపడ్డారట. రామ్‌చరణ్ సతీమణి ఉపాసన మేకప్ అసిస్టెంట్ ఈ విషయాల ను తన ఇన్ స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
#RamCharan #ShahRukhKhan #AmbaniPreWedding #AmbaniFamilyWedding pic.twitter.com/61sjmw60NP
— TollywoodHub (@tollywoodhub8) March 4, 2024
దీంతో రామ్‌చరణ్ అభిమానులు షారుక్‌ఖాన్ తీరుపై మండిపడుతున్నారు.
#ShahRukhKhan #SalmanKhanpic.twitter.com/kx0uxtajkh
— TollywoodHub (@tollywoodhub8) March 4, 2024
ఇక సినిమాల విషయానికి వస్తే..రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ‘గేమ్‌చేంజర్’ సినిమా చేస్తున్నారు.
‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. అలాగే బుచ్చిబాబు డైరెక్షన్లో
రామ్‌చరణ్ ఓ రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ వేసవిలో ప్రారంభం కానుందని
తెలిసింది. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతు న్నాయని తెలిసింది.