Aamirkhan: ఆమీర్‌ఖాన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘లాల్‌సింగ్ చడ్డా’ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్‌గంప్’కు హిందీ రీమేక్‌గా ‘లాల్‌సింగ్ చడ్డా’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా కోసం ఆమిర్‌ఖాన్ (Aamirkhan) చా లా అంటే చాలా కష్టపడ్డారు. కానీ నిరాశ తప్పలేదు. పైపెచ్చు…ఈ సినిమా కంటే ముందు ఆమిర్‌ఖాన్ చేసిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. అమితాబ్‌బచ్చన్‌తో తొలిసారి ఆమిర్‌ఖాన్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇలా..వరుస డిజాస్టర్ సినిమాలు రావడంతో ఆమిర్ ఖాన్ డైలమాలో పడ్డారు. 2022లో విడుదలైన ‘లాల్‌సింగ్ చడ్డా’ తర్వాత మరో కొత్త సినిమాకు సైన్ చేయ లేదు. అలా ఏడాదిపాటు అజ్ఞాతవాసంలో ఉన్న ఆమిర్‌ఖాన్ ఫ్యామిలీకి టైమ్ కేటాయించాడు. రీసెంట్గా కూతురు ఐరాఖాన్ పెళ్లి కూడా చేశాడు.
మళ్లీ ఇప్పుడు సినిమాలతో బిజీ కావాలనుకుంటున్నారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వంలో ‘సితారే జమీన్పర్’ సినిమాకు ఇటీవల సైన్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి మొదటివారంలో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అలాగే నిర్మాతగా ఆమిర్‌ఖాన్ నిర్మిస్తున్న ‘లాహోర్ 1947’ చిత్రం షూటింగ్ కూడా ఫిబ్ర వరిలోనే మొదలు కానుంది. ఇటీవల ‘గదర్ 2’తో బంపర్‌హిట్ కొట్టిన సన్నీడియోల్ ఈ సినిమాకు హీరో. రాజ్‌కుమార్ సంతోషి దర్శకుడు.