AkkineniAkhil: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘సలార్’. ఈ సినిమాలోని తొలిపార్టు ‘సలార్: సీజ్ఫైర్’ చిత్రం 2023 డిసెంబరు 22న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ‘సలార్:సీజ్ఫైర్’ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను చిత్రంయూనిట్ బెంగళూరులో గ్రాండ్‌గా నిర్వహించింది.
ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిలో అక్కినేని అఖిల్ (AkkineniAkhil) చేతికట్టుతో కనిపించాడు. ఈ విషయం కన్నా కూడా ‘సలార్’ ఫ్రాంచైజీలో అక్కినేని అఖిల్ భాగమైయ్యారనే వార్తలు అక్కినేని ఫ్యాన్స్‌కు సంతోషా నిచ్చాయి. కానీ ఆశలు నిజం కావని తెలిపోయింది. ప్రశాంత్‌నీల్ భార్య లిఖితా రెడ్డి అప్పుడప్పుడు ఇన్‌స్టా వేదికగా చాట్ చేస్తుంటారు. రీసెంట్ లిఖిత ఇలా చాట్ ఓ సెషన్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘సలార్’ ప్రాంచైజీలో అఖిల్ ఉన్నాడా? అని అడగ్గా, ‘సలార్’లో అఖిల్ అన్నవార్త పుకారే అని తెల్చి పోరేశారు. దీంతో అఖిల్ ఫ్యాన్స్ నిరాశకు గురైయ్యారు.
#SalaarOnNetflix#SalaarCeaseFire #Salaar2#SalaarRulingBoxOffice
So #SalaarPart3 on the Way
— – #PrasanthNeel Wife Likitha Reddy Insta Chat info pic.twitter.com/pDtVZw1Ym7
— TollywoodHub (@tollywoodhub8) January 20, 2024
అలాగే ఈ చాట్ సెషన్లో మరికొన్ని ఆసక్తికరమై విశేషాలను కూడా వెల్లడించారు లిఖిత. ఆల్రెడీ విడుదల చేసిన ‘సలార్’ డైనోసార్ డైలాగ్ సెకండ్ పార్టులో వస్తుందని, స్పెషల్ సాంగ్కూడా ‘సలార్’ పార్టు 2లో ఉంటుందని లిఖిల పేర్కొన్నారు. అంతేకాదు..‘సలార్: శౌర్యాంకాపర్వం’ చివర్లో థర్డ్పార్టు ఉంటుందా? లేదా? అనే విషయం కూడా తెలుస్తుందని లిఖిత పేర్కొన్నారు.
#AkhilAkkineni cameo in #salaar ✖
:- PrasanthNeel Wife Likitha Reddy pic.twitter.com/JtKlbD2naV
— TollywoodHub (@tollywoodhub8) January 20, 2024
ఇక ‘సలార్’ సినిమా కోసం సిమ్రత్ కౌర్ ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. ప్రస్తుతం ‘సలార్’ సినిమా హిందీలో కాకుండ దక్షిణాది భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
మరోవైపు అఖిల్ హీరోగా అనిల్ అనే ఓ కొత్త దర్శకుడు ఓ సోషియో ఫ్యాంటసీ సినిమాను నిర్మించ నున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.