Tollywood: ప్రస్తుతం టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫామ్‌లో ఉంది. భారతీయ సినీ పరిశ్రమ దృష్టంతా టాలీవుడ్‌పైనే. ఆస్కార్ అవార్డు సైతం టాలీవుడ్‌ను వరించింది. జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడి విభాగం ఆల్మోస్ట్ నార్త్ స్టార్స్‌కే. కానీ ఈ సారి ..అంటే తొలిసారి ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు గాను అల్లు అర్జున్‌కు వచ్చింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టాప్ 5లో రెండు తెలుగు సినిమాలే ఉన్నాయి. దీంతో టాలీవుడ్ కలెక్షన్స్‌ను తక్కువగా చేయాలని, బాలీవుడ్ ఓ బాక్సాఫీస్ ప్లాన్ రెడీ చేస్తోంది. అది ఏంటంటే…టాలీవుడ్ స్టార్స్ సినిమాలు విడుదల అవుతు న్న సమయంలోనే..బాలీవుడ్ స్టార్స్ సినిమాలు విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
దేవర వర్సెస్ బడేమియాన్ చోటా మియాన్
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న తాజా చిత్రం ‘దేవర’. జాన్వీకపూర్ హీరోయిన్. కొరటాల శివ దర్శ కత్వం వహిస్తున్నారు. రెండు పార్టులుగా ఈ సినిమా విడుదల కానుంది. తొలిపార్టు ఏప్రిల్ 5న విడుదల కానుంది. అయితే ఇదే సమయంలో బాలీవుడ్ మల్టీస్టారర్ ఫిల్మ్ ‘బడేమియాన్ చోటే మియాన్’ రిలీజ్‌కు సిద్ధమౌతోంది. అలీ అబ్బాస్జాఫర్ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమాలో అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్సుకుమార్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం ఈద్‌కు రిలీజ్ అవుతోంది.
గేమ్‌చేంజర్ వర్సెస్ స్కైఫోర్స్
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘గేమ్‌చేంజర్’. శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు చిత్రంయూనిట్. అదే రోజున…అక్షయ్‌కుమార్ ‘స్కైఫోర్స్’ కూడా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. అభిషేక్కపూర్, సందీప్ కెల్వాణి సంయుక్తంగా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నారు. నుమ్రత్ కౌర్, సారా అలీఖాన్ హీరోయిన్స్.
పుష్ప వర్సెస్ సింగమ్ఎగైన్
హిందీలో ‘పుష్ప: ది రైజ్’ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో ప్రస్తుతం ఈ సినిమా మలిభాగం ‘పుష్ప: ది రూల్’పై ఫోకస్ పెట్టారు ఈ చిత్రం హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్. అలాగే ఈ సినిమాను ఆగస్టు 15న థియేటర్స్‌లో విడుదల కానుంది. కానీ ఇదే రోజున…బాలీవుడ్ సక్సెస్ ఫ్రాంచైజీ అయిన ‘సింగమ్’ నుంచి థర్డ్ పార్టు ‘సింగమ్ ఎగైన్’వస్తోంది. అజయ్‌దేవగన్, అక్షయ్‌కుమార్, టైగర్‌ష్రాఫ్, దీపికా పదుకొనె, కరీనాకపూర్ వంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో ఉన్నారు. పైగా కమర్షియల్ సినిమాలను పక్కాగా తీయగల రోహిత్‌శెట్టి ఈ సినిమాకు దర్శకుడు.
గత ఏడాది షారుక్‌ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలతో హిట్స్ కొట్టారు. రణ్‌బీర్‌కపూర్ ‘యానీమల్’తో రెచ్చిపోయాడు. ఇలా బాలీవుడ్ కాస్త గాడిన పడినట్లే కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో బాలీవుడ్ బడా సినిమాలు విడుదల అవుతోన్న రోజునే…టాలీవుడ్ సినిమాలు విడుదల అయితే థియేటర్స్, స్క్రీన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. టాలీవుడ్ సినిమాల కలెక్షన్స్ తగ్గిపోతాయి. కొన్ని రికార్డ్స్ దూరమవుతాయి కూడా. మరి.. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూడాలి.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే…ఎన్టీఆర్ ‘దేవర’, రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’, అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలకు పోటీగా వస్తున్న మూడు బాలీవుడ్ సినిమాల్లోనూ అక్షయ్‌కుమార్ ఉన్నాడు. ఈ ప్రకారం టాలీవుడ్ స్టార్స్‌ను అక్షయ్‌కుమార్ టార్గెట్ చేసినట్లే అనుకోవచ్చు.