Corporate bookings: సామాన్య సగటు ప్రేక్షకుడికి కార్పొరేట్ బుకింగ్స్‌పై పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. కానీ బాలీవుడ్ వంటి ఇండస్ట్రీలో ఆ తరహా కోపరేటివ్ కార్పొరేటివ్ బుకింగ్స్‌ను చూస్తుంటాము. సాధారణంగా కార్పొరేట్ బుకింగ్స్ రెండు రకాలుగా జరుగుతుంటాయి. కొన్నిసార్లు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న స్టార్ హీరోల సినిమాలకు సైతం బుకింగ్స్ తక్కువగా ఉండొచ్చు (ముఖ్యంగా ఐపీఎల్ సీజన్, క్రికెట్ వరల్డ్ కప్, ఎలక్షన్ టైమ్, స్టార్ హీరోల ఓటీటీ రిలీజ్లు…ఇలాంటి కారణాల వల్ల). ఆడియన్స్, ట్రేడ్ (ఫిల్మ్ మార్కెట్)లో తక్కువ బజ్(ఆ సినిమా రిలీజ్‌ను గురించి ఎక్కువమందికి తెలియకపోవడం వంటి అంశాలు..) క్రియేట్ అయ్యి ఉండొచ్చు. ఇలాంటి సమయాల్లోనే ఆ సినిమా మార్కెటింగ్ టీమ్ ఈ కార్పొరేట్ బుకింగ్స్‌ను మార్కెటింగ్ స్ట్రాటజీగా వాడతారు. మూవీ ఆన్లైన్ బుకింగ్ పోర్టల్స్‌లో ఆ సినిమా టికెట్స్‌ను ఆ సినిమా మార్కెటింగ్ టీమ్వారే పెద్దమొత్తంలో బుక్ చేస్తారు. దీంతో ఎవరైనా ఓ సాధరణ ప్రేక్షకుడు సినిమాకు వెళ్లాలనుకుని మూవీ బుకింగ్ ఆన్లైన్ పోర్టల్‌ను ఓపెన్ చేయగానే చాలా థియేటర్స్‌లో బుకింగ్స్ బాగా జరుగుతున్నట్లుగా గమనిస్తాడు. దీంతో వెంటనే ఆ సినిమాను చూసేందుకు టిక్కెట్స్ కొంటాడు. ఇలా మార్కెటింగ్ టీమ్ బుక్ చేసిన టికెట్ డబ్బులు, ఆడియన్స్ బుక్ చేసిన టికెట్ డబ్బులు ఆ సినిమా కలెక్షన్స్‌లో చేరిపోతాయి. రిలీజ్ మరుసటి రోజు మా సినిమాకు ఇంత కలెక్షన్స్ వచ్చాయని మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తారు.
రెండోరకం…ఓ సినిమా రిలీజ్ కాగానే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలకు ఆ సంస్థలు సినిమా టిక్కెట్స్‌ను ఫ్రీగా ఇస్తుంటాయి. కొన్నిసార్లు బహుమతులుగా కూడా. కానీ ఈ టికెట్స్ అన్నీ ఆ సినిమా మార్కెటింగ్ టీమ్‌నే స్పాన్సర్ చేస్తారట. ఇలా ప్రీగా టికెట్స్ పొందినవారు సినిమా చూసేందుకు థియేటర్స్‌కు క్యూ కడతారు. థియేటర్స్ ఆక్యూపెన్సీ పెరుగుతుంది. ఈ వీడియోలను సోషల్‌మీడియాలోకి వదిలి, ఆ సినిమా సూపర్‌హిట్ అయినట్లుగా సదరు ఆ మూవీ టీమ్ పబ్లిసిటీ చేస్తుంది. సినిమా బాగానే ఉందని, ఆడియన్స్ వీడియోల్లో కనిపిస్తున్నారని సగటు ప్రేక్షకుడు సినిమా టికెట్ కొని(ధర ఏంతైనా..) చూస్తాడు. ఓ పెద్ద స్టార్ హీరో సినిమా 500కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్‌కు చేరువలో, 1000కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌కు చేరువలో ఉన్నప్పుడు ఈ తరహా కార్పొరేట్ బుకింగ్స్ కనిపిస్తుంటాయి. ఇక సోషల్‌మీడియాలో ఇన్ప్లూయెర్స్ వారి ఫాలోయేర్స్కు టికెట్లను స్పాన్సర్ చేస్తుంటారు. ఇవి కూడా ఓ తరహా కార్పొరేట్ బుకింగ్స్‌నే. ఎందుకంటే ఈ ఇన్ప్లూయెర్స్ వారి సొంత డబ్బులతో నెటిజన్లకు టికెట్స్ ఇవ్వరు. వీరికి మూవీ పబ్లిసిటీ టీమ్ నుంచి ప్రీగా టికెట్స్ వస్తుంటాయి.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే…బాలీవుడ్లో షారుక్‌ఖాన్ తాజా రణ్‌బీర్‌కపూర్ ‘యానిమల్’, షారుక్‌ఖాన్ ‘డంకీ’, ప్రభాస్ ‘సలార్’ చిత్రాలకు హిందీలో కార్పొరేట్ బుకింగ్స్ జరుగుతున్నాయనే టాక్ తెరపైకి వచ్చింది. నిజంగానే జరుగుతున్నాయా? లేక ఆ చిత్రాల యాంటీ ఫ్యాన్స్ ఇలాంటి పుకార్లను సోషల్మీడయా వేదికగా తెరపైకి తెచ్చారా? అనేది తెలియడం లేదు. ఒకవేళ నిజమే అయితే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలకే కార్పొరేట్ బుకింగ్స్ ప్రస్తావన తెరపైకి వస్తే…ఇక ఓ మోస్తారు సినిమాల పరిస్థితి ఏంటి? నిజమైన సగటు ప్రేక్షకుడు సినిమాలను ఎంచుకునే ఛాయిస్‌లకు ఏ ప్రామాణికత ఉండాలనేది ప్రస్తుతం చర్చించుకోవాల్సిన ఓ అంశం.