సినిమా: డంకీ (హిందీ)
ప్రధాన తారాగణం: షారుక్‌ఖాన్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ
నిర్మాతలు: గౌరీఖాన్, రాజ్‌కుమార్ హిరాణి
మ్యూజిక్: ప్రీతమ్
నేపథ్యం సంగీతం: అమన్
విడుదల తేదీ: 21–12–2023.
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ ఏడాది విడుదలైన షారుక్ యాక్షన్ చిత్రాలు ‘జవాన్’, ‘పఠాన్’ వెయ్యికోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించాయి. ఇప్పుడు షారుక్చేసిన ఎమోషనల్ మూవీ ‘డంకీ’. హిందీలో ‘మున్నాభాయ్ ఎమ్‌బీబీఎస్’, ‘పీకే’, ‘3ఇడియట్స్’, ‘సంజు’వంటి హిట్ ఫిల్మ్స్ తీసిన ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి ఈ సినిమాకు దర్శకుడు. ఈ హిట్ కాంబినేషన్లో వచ్చిన ‘డంకీ’ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. మరి..డంకీ విజయం సాధించిందా?
కథ
ఆర్థిక సమస్యలతో స్నేహితులైన మను (తాప్సీ), బుగ్గు (విక్రమ్ కొచ్చర్), బల్లి (అనీల్గ్రోవర్) లండన్ వెళ్లి సంపాదించి, ఆ ఇబ్బందుల నుంచి గట్టెక్కాలని నిర్ణయించుకుని, ఆ ప్రయత్నాల్లో ఉంటారు. శత్రువుల నుంచి తన ప్రాణాలు కాపాడినందుకు తోటి సోల్జర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు పంజాబ్ వస్తాడు హర్థ్యాల్
సింగ్. అయితే తన ప్రాణాలు కాపాడిన సోల్జర్ మను సోదరుడని, ఓ ప్రమాదంలో అతను చనిపోవడం వల్ల మను కుటుంబం సొంత ఇంటిని కూడా తాకట్టుపెట్టి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని గ్రహిస్తాడు హర్థ్యాల్. దీంతో మను లండన్ వెళ్లేవరకు ఆమెకు సహాయంగా ఉండాలనుకుంటాడు. ఈ సమయంలోనే మను, బుగ్గు, బల్లిలను లండన్ తీసుకువెళ్తానన్న ఓ ఏజెంట్ మోసకారి అని తెలుస్తుంది. దీంతో స్టూడెంట్ వీసాతో లండన్ వెళ్లొచ్చని, ఇందుకు ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలని హార్థ్యాల్ వారికి సలహా ఇస్తాడు. ఈ క్రమంలోనే మనుతో ప్రేమలో పడతాడు హార్థ్యాల్. అలా మను, బుగ్గు, బల్లి, హార్థ్యాల్ కలిసి ఓ ఇంగ్లీష్ టీచర్ దగ్గర జాయిన్ అవుతారు. ఇక్కడ హార్థ్యాల్ అండ్ గ్యాంగ్‌లో సుఖి కూడా జాయిన్ అవుతాడు. ప్రేమించిన అమ్మాయి జెస్సీతో నిశ్చితార్థం జరిగినా కూడా, ఓ లండన్‌తో కుర్రాడి సంబంధం వచ్చిందని జెస్సీ తండ్రి ఆమెకు ఆ లండన్ కుర్రాడితో ఇష్టం లేని పెళ్లి చేస్తాడు. లండన్ వెళ్లి జెస్సీని తిరిగి తీసుకురావాలన్నది సుఖి «లక్ష్యం. అయితే మను, హర్థ్యాల్, సుఖి, బుగ్గు వారి లండన్ వీసా ప్రయత్నాల్లో విఫలం అవుతారు. దీంతో మను, సుఖిలతో పాటు మరోముగ్గుర్నీ ‘డంకీ’ రూట్(అక్రమ మార్గాన) లండన్ తీసుకుని వెళ్లేందుకు హార్థ్యాల్ ప్లాన్ చేస్తాడు. హార్థ్యాల్, బుగ్గు, మను డంకీ రూట్లో ఎలా లండన్ వెళ్లారు? అక్కడికి వీరి కంటే ముందే వెళ్లిన బల్లి, తన స్నేహితులకు ఏ విధంగా సహాయం చేశాడు? లండన్ వెళ్లిన తర్వాత కూడా హార్థ్యాల్ ఒక్కడే తిరిగి ఎందుకు ఇండియాకు వస్తాడు? సుఖి ప్రేమకథ ఎలా ముగిసింది? పాతికేళ్ల తర్వాత మను, బుగ్గు, బల్లి ఎందుకు ఇండియాకు తిరిగి రావాలనుకుంటారు? వీరికి హార్థ్యాల్ ఏ విధంగా సహాయం చేస్తాడు? మనుతో హార్థ్యాల్ ప్రేమకథ ఎలా ముగుస్తుంది? అనే అంశాలు థియేటర్స్‌లో చూడాలి.
విశ్లేషణ
చట్టవిరుద్ధంగా లండన్‌కు వెళ్లాలనుకునే ఐదుగురు స్నేహితుల జీవితాల కథే ‘డంకీ’. కథ 21 శతాబ్ధంలో మొదలైనా, కథ మేజర్‌గా 1995లో పంజాబ్‌లోని ఓ ఊర్లో జరుగుతున్నట్లుగా చూపించారు. ఈ ఐదుగురి నేపథ్యాలు, వారి వ్యక్తిగత జీవితాల్లోని విషాదాల పరిచయాలతో ప్రధానంగా ఫస్టాఫ్ సాగుతుంది. అయితే ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు హాస్యభరితంగా ఉంటాయి. ముఖ్యంగా ఇంగ్లీష్ క్లాసెస్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షుకులను కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే ఎప్పుడైతే సుఖి పాత్ర పరిచయం లోతుగా వస్తుందో అప్పుడే కథలో సీరియస్ నెస్ పెరుగుతుంది. ఓ భావోద్వేగాల మోతాదు పెరుగుతుంది. సుఖి పాత్రతో ముడిపడి ఉన్న ఓ బలమైన భావోద్వేగంతో ఇంట్రవెల్ ముగుస్తుంది. డంకీ రూట్లో లండన్ చేరుకోవడంలోని సవాళ్లు, ఈ క్రమంలో హార్థ్యాల్, బుగ్గు, మను లండన్ చేరుకున్నాక ఎదురైన పరిస్థితులతో సెకండాఫ్ ముగుస్తుంది. టైటిల్ డంకీ అనే ఉన్నప్పటికీని కథలో ప్రేమ, స్నేహాం, హాస్యం, దేశభక్తి అంశాలను జోడించడంలో హిరాణి సూపర్‌సక్సెస్ అయ్యారు. లండన్ కోర్టులో షారుక్ సంభాషణలు ఆసక్తిగా ఉంటాయి. షారుక్, తాప్సీల ప్రేమకథ కూడా కథను ఏ మాత్రం డిస్ట్రబ్చేయవు. అది హిరాణి హిట్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. లండన్ వెళ్లాలనుకోవడం కరెక్టే కానీ అక్కడికి చేరుకున్నాక, ఏ చేసి డబ్బులు సంపాదించాలనే క్లారిటీ ఉండదు. పాత్రలు ఎంతసేపు లండన్ వెళ్లాలను కుంటాయే తప్ప, లండన్ ఏ లక్ష్యంతో వెళ్లాలనుకుంటున్నారో ఆసక్తిగా ఉండదు. యాక్షన్ సన్నివేశాలు, పూర్తి స్థాయి రొమాన్స్‌ను ఆశించే బీ,సీ సెంటర్స్‌కు మాత్రం ‘డంకీ’ నిరాశపరచవచ్చు. డంకీ రూట్లో లండన్‌కు వెళ్లినప్పుడు, ఆ ప్రయాణ్ని చాలా తక్కువ నిడివితోనే చూపించారు. టైటిల్ అదే పెట్టి డంకీ రూట్ సవాళ్లను, ఆ పరిస్థితులను సరిగా ఎస్టాబ్లిష్ కాలేదు. అయితే ఎమోషనల్ యాంగిల్ మాత్రం ప్రతి ఆడియన్‌కు కనెక్ట్ అవుతుంది. కంటతడి పెట్టిస్తుంది.
ఎవరు ఎలా చేశారంటే…
హార్థ్యాల్సింగ్గా షారుక్‌ఖాన్ అద్భుతంగా నటించారు. యాక్షన్ మాత్రమే కాదు..మిగిలిన ఎమోషన్స్‌లో కూడా తనెంత గొప్ప నటుడో షారుక్ మరోసారి నిరూపించు కున్నారు. ఇంట్రవెల్, క్లైమాక్స్, సెకండాఫ్ స్టార్టింగ్‌లో షారుక్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్‌ను ఆడియన్స్ ఆస్వాదించవచ్చు. ఫస్టాఫ్‌లో లుట్ఫుట్ గయా సాంగ్
లోనూ డిఫరెంట్ డ్యాన్స్ చేశాడు. 30ఏళ్ల కుర్రాడిగా, 55 ఏళ్ల వ్యక్తిగా బాగా నటించాడు. ‘పింక్’ సినిమా స్థాయి నటన, హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ‘డంకీ’లో తాప్సీకి దక్కింది. షారుక్ తర్వాత సినిమాను నడిపించింది తాప్సీనే. అందుకేనెమో..టైటిల్స్‌లో తాప్సీ పేరు వేసిన తర్వాతే షారుక్ పేరు వేశారు. సుఖిగా విక్కీ కౌశల్ పాత్ర తొలిభాగంలోనే ఉంటుంది. కానీ ఉన్న స్క్రీన్ స్పేస్‌లో విక్కీ ఎమోషనల్‌గా యాక్ట్ చేశాడు. బోమాన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ వారి పాత్రల మేరకు మెప్పించారు. ఇక రాజ్‌కుమార్ హిరాణి స్టైల్ ఆఫ్ కథ, స్క్రీన్ ప్లే ఆలరిస్తాయి. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, షారుక్–తాప్సీల లవ్‌స్టోరీ ఎండింగ్ హిరాణి స్టైల్లో ఉంటాయి. ఓ మై లవ్ ఎమోషనల్‌గా, లుట్పుట్సాంగ్లు బాగున్నాయి. ప్రీతమ్ మంచి సంగీతం ఇచ్చారు. గౌరీఖాన్, హిరాణిల నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు
కథ, స్క్రీన్ ప్లే
షారుక్‌ఖాన్, తాప్సీల నటన
కామెడీ సన్నివేశాలు
బలహీనతలు
సెకండాఫ్‌లో కొన్ని రోటీన్ సన్నివేశాలు
యాక్షన్ మోతాదు తక్కువ
కొన్ని సాగదీత సన్నివేశాలు
ఫైనల్‌గా– పల్టీ కొట్టిన డంకీ(2.5)