హీరో షారుక్‌ఖాన్ (ShahRukhKhan), దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి కాంబినేషన్లో రూపొందుతున్న ఎమోషనల్ మూవీ ‘డంకీ’. విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్, తాప్సీ, బొమన్ ఇరానీ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తు న్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదలైంది. జీవితంలో స్థిరపడాలని లండన్ వెళ్లేందుకు రెడీ సిద్ధం అయిన ఐదుగురు స్నేహితుల ప్రయాణమే ‘డంకీ’ సినిమా అని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. రాజ్‌కుమార్ హిరాణి, షారుక్‌ఖాన్ భార్య గౌరీఖాన్ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబరు 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. షారుక్‌ఖాన్ హీరోగా నటించిన గత చిత్రాలు ‘పఠాన్’, ‘జవాన్’ వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన నేపథ్యంలో, షారుక్ నుంచి వస్తున్న ఈ తాజా చిత్రంపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి.