‘క్షణం’, ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి సినిమాలతో హీరో అడివి శేష్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులు. తాజాగా ఈ టాలెంటెడ్ హీరో సైన్ చేసిన లవ్ యాక్షన్ ‘డకాయిట్’. శ్రుతీహాసన్ హీరోయిన్. కెమెరామేన్ షానీ డియోల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. ఇద్దరు మాజీ ప్రేమికులు బందిపోట్లుగా మారతారు? అయితే ఈ ఇద్దరు కలిసి ఓ దొంగతనం చేయాల్సివచ్చినప్పుడు ఏం జరుగుతుందనేది ‘డకాయిట్’కథగా తెలుస్తోంది. ఈ సినిమా కాకుండ ‘గూఢచారి 2’ చేస్తున్నారు అడివి శేష్.